ప్రసవం తరువాత బిడ్డను చూసిన తల్లికి భారీ షాక్! శరీరం వెలుపల వేలాడుతున్న పేగులు..!

ABN , First Publish Date - 2021-12-24T23:59:50+05:30 IST

అప్పటికి ఆష్లే ఫౌలర్ 3 నెలల గర్భిణి! పుట్టబోయే బిడ్డ ఎలా బోసి నవ్వులు ఎలా ఉంటాయో ఊహించుకుంటూ తియ్యని కలల్లో విహరిస్తోంది. కానీ.. ఆ రోజు వైద్యులు చెప్పింది ఆమెకు కాళ్ల కింద భూమి కదిలిపోతున్నట్టు అనిపించింది.

ప్రసవం తరువాత బిడ్డను చూసిన తల్లికి భారీ షాక్! శరీరం వెలుపల వేలాడుతున్న పేగులు..!

ఇంటర్నెట్ డెస్క్: అప్పటికి ఆష్లే ఫౌలర్ 3 నెలల గర్భిణి! పుట్టబోయే బిడ్డ బోసి నవ్వులు ఎలా ఉంటాయో ఊహించుకుంటూ తియ్యని కలల్లో విహరిస్తోంది. కానీ.. ఆ రోజు వైద్యులు చెప్పింది విన్న ఆమెకు కాళ్ల కింద భూమి కదిలిపోతున్నట్టు అనిపించింది. ఓ అరుదైన సమస్య కారణంగా గర్భస్థ శిశువులోని కొన్ని అవయవాలు శరీరం వెలుపలే అభివృద్ధి చెందుతున్నాయని డాక్టర్లు చెప్పడంతో ఆమెకు నోట మాట రాలేదు. ఆ తరువాత.. ప్రసవం అయ్యే వరకూ ఆమె భయం భయంగానే గడిపింది. సహజపద్ధతిలో ప్రసవం అయ్యే అవకాశం లేకపోవడంతో వైద్యులు సిజేరియన్ ద్వారా ఆమెకు డెలివరీ చేశారు. 


ప్రసవం తరువాత బిడ్డను చూసుకుని ఆమె ఒక్కసారిగా షాకైపోయింది.  శిశువు శరీరంపై వేలాడుతున్న పేగులను వైద్యులు ఓ కవర్‌లో జాగ్రత్తగా పెట్టారు. అవి తేమ కోల్పోకుండా, వాటి ఉష్ణోగ్రత పడిపోకుండా వైద్యులు ఈ ఏర్పాటు చేశారు. బిడ్డను మనసారా గుండెలకు హత్తుకునే భాగ్యం ఆమెకు దూరమైన క్షణం అది. శిశువు ప్రాణాలతో ఇంటికొస్తాడో లేదో తెలియని స్థితి! ఆ తరువాత వైద్యులు అత్యంత క్లిష్టమైన ఆపరేషన్ చేసి అవయవాలను శరీరంలో వాటి యథాస్థానంలో పెట్టారు. అనంతరం.. మూడు వారాల పాటు శిశువును ఆస్పత్రిలోనే ఉంచి ఆరోగ్య పరిస్థితిని వేయ్యి కళ్లతో గమనించారు. వైద్యుల కృషికి అదృష్టం కూడా తొడవడంతో బిడ్డ పూర్తి స్థాయిలో కోలుకున్నాడు. ఇటీవలే వారు బిడ్డను డిశ్చార్ చేశారు. బ్రిటన్‌లో ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా పెద్ద చర్చకే దారి తీసింది.  


ఆష్లే, ఆమె భర్త తమ సంతానానికి కోవా అని పేరుపెట్టుకున్నారు. హవాయి భాష ప్రకారం.. కోవా అంటే పోరాట యోధుడు అని అర్థం. ‘‘బిడ్డకు ఈ సమస్య ఉందని తెలియకమునుపే ఈ పేరు పెట్టుకోవాలని నిర్ధారించుకున్నాం. గతాన్ని ఇప్పుడు ఓ మారు తలుచుకుంటే..అప్పటి మా నిర్ణయం ఎంత సబబైనదోనని అనిపిస్తోంది’’ అని వారు వ్యాఖ్యానించారు. కోవా పుట్టి ఇప్పటికి ఐదు వారాలు గడిచాయి. ప్రస్తుతం కోవా తన ఇంట్లోనే తల్లిదండ్రుల సంరక్షణలో పెరుగుతున్నాడు. గ్యాస్కోషైసిస్ అనే రుగ్మత కారణంగా ప్రతి పది వేల మంది శిశువుల్లో ఒకరు ఇలా జన్మిస్తారని వైద్యులు చెబుతున్నారు. గర్భస్థశిశువు ఉదర భాగంలోని కీలకమైన పొర ఏర్పడడంలో లోపాల కారణంగా పేగులు శరీరం వెలుపల అభివృద్ధి చెందాయని వారు పేర్కొన్నారు. 

Updated Date - 2021-12-24T23:59:50+05:30 IST