Viral: వింత పని.. నెట్టింట వైరల్‌.. వీడియో చూసిన నెటిజన్లు షాక్

ABN , First Publish Date - 2022-06-13T01:48:29+05:30 IST

అమ్మాయిలు అందంగా కనిపించడం కోసం రకరకరాల మేకప్‌కిట్‌లు వాడుతుంటారు. ఇంకా రకారకాల ఫేషియల్‌లు ఉపయోగిస్తుంటారు. బ్యూటీపార్లర్‌లకు వెళ్లి ప్రత్యేకమైన..

Viral: వింత పని.. నెట్టింట వైరల్‌.. వీడియో చూసిన నెటిజన్లు షాక్

అమ్మాయిలు అందంగా కనిపించడం కోసం రకరకరాల మేకప్‌కిట్‌లు వాడుతుంటారు. ఇంకా రకారకాల ఫేషియల్‌లు ఉపయోగిస్తుంటారు. బ్యూటీపార్లర్‌లకు వెళ్లి ప్రత్యేకమైన ట్రీట్‌‌మెంట్ తీసుకుంటారు. అవసరమైతే ప్లాస్టిక్‌ సర్జరీ కూడా చేయించుకుంటారు. అయితే పురుషులకు ఉండే విధంగా మహిళలకు కాళ్లు, చేతుల మీద రోమాలు ఉండడాన్ని ఇష్టపడరు. వాటిని అప్పుడప్పుడు తొలగించుకుంటారు. ముఖ్యంగా ఏదైనా శుభకార్యాలు, ఫంక్షన్లప్పుడు బ్యూటీపార్లర్‌లకు వెళ్తుంటారు. అయితే ఓ యువతి మాత్రం అందంగా కనిపించేందుకు వినూత్నంగా ప్రయత్నించింది.


అమెరికాకు చెందిన లిసా అనే యువతి అందంగా కనిపించడం కోసం రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉంటుంది. ఇందులో భాగంగా చిత్ర విచిత్రంగా మేకప్‌లు వేసుకుంటోంది. పైగా తనొక మేకప్ ఆర్టిస్ట్ కూడా.. అయితే ఆమెకు నుదురు వెంట్రుకలు కాస్త మందంగా ఉంటాయి. దీంతో ఆమె ప్రతిరోజు ఐబ్రోస్‌ను షేవ్ చేసుకుంటుంది. తన వెంట్రుకలు మందంగా ఉన్నందుకు తాను షేవ్ చేసుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది. ఆమె రోజూ ఒక్కో విధంగా రెడీ అవుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టులు పెడుతూ ఉంటుంది. ప్రస్తుతం లీసా చేస్తున్న వింత పని నెట్టింట వైరల్‌గా మారింది. దీన్నిచూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. రోజూ షేవ్ చేయడం ఏంటీ.. గ్రహంతర వాసిలా ఉన్నావంటూ కామెంట్లు చేస్తున్నారు.



Updated Date - 2022-06-13T01:48:29+05:30 IST