Abn logo
May 8 2021 @ 00:00AM

అడ‌వి పంది దాడిలో మహిళకు తీవ్ర గాయాలు

మేడారం, మే 8: తునికాకు సేకరణకు వెళ్లిన మహిళపై అడవి పంది దాడి చేసిన సంఘటన మండలంలోని ఎల్బాక గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో శనివారం  చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన జెజ్జరి ఈశ్వరమ్మ ఉదయం శివారులోని అటవీ ప్రాంతానికి తునికాకు సేకరించేందుకు వెళ్లింది. ఆకు సేకరిస్తుం డగా ఒక్కసారిగా అడవి పంది దాడి చేసింది. దీంతో ఆమె చేతికి తీవ్ర గాయమై అస్వస్థతకు గురైంది. ఈశ్వర మ్మకు స్థానికంగా ప్రాథమిక చికిత్స చేయించి మెరుగైన వైద్యం కోసం హన్మకొండలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు.