భర్త తల నరికి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లిన భార్య.. తన కథ చెప్పి పోలీసులకు లొంగిపోయి..

ABN , First Publish Date - 2022-04-20T08:21:51+05:30 IST

ఉత్తరాఖండ్‌లోని జూలాఘాట్‌ పోలీసులకు ఓ మహిళ కోలుకోలేని షాకిచ్చింది.. ఆ మహిళ తన భర్తను చంపి అతడి తలను తీసుకుని నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది.. తన భర్తను చంపేశానని, లొంగిపోవాలని వచ్చానని చెప్పింది..

భర్త తల నరికి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లిన భార్య.. తన కథ చెప్పి పోలీసులకు లొంగిపోయి..

ఉత్తరాఖండ్‌లోని జూలాఘాట్‌ పోలీసులకు ఓ మహిళ కోలుకోలేని షాకిచ్చింది. ఆ మహిళ తన భర్తను చంపి అతడి తలను తీసుకుని నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. తన భర్తను చంపేశానని, లొంగిపోవాలని వచ్చానని చెప్పింది.. భర్తను అంత క్రూరంగా  చంపినందుకు ఆమె మొహంలో చిన్న పశ్చాత్తాపం కూడా లేకపోవడం పోలీసులకు విస్మయం కలిగిచింది.


ఓ మహిళ తన భర్తను నరికి చంపి, అతన తలతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లడం జూలాఘాట్‌లో కలకలం రేపింది. తన భర్తను చంపేశానని, లొంగిపోదామని వచ్చామని ఆమె పోలీసులకు చెప్పింది. షాకైన పోలీసులు ఆమె ఇంటికి వెళ్లి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ మహిళను అదుపులోకి తీసుకున్నారు. తన భర్తను చంపినందుకు ఆమెకు అస్సలు పశ్చాత్తాపం లేదు.  


తన భర్తను ఎందుకు అంత కిరాతంగా చంపిందో ఆ మహిళ పోలీసులకు చెప్పినట్టు సమాచారం. పోస్ట్‌మార్టమ్ అనంతరం పోలీసులు మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.  

Updated Date - 2022-04-20T08:21:51+05:30 IST