Viral Video: పద్ధతిగా చీర కట్టుకుని మరీ ఈ మహిళ చేసిన ఫీట్‌కు నెటిజన్లు ఫిదా..!

ABN , First Publish Date - 2022-06-08T17:32:06+05:30 IST

స్కేటింగ్ చేయడం అనేది చాలా పెద్ద టాస్క్. ఎంతో శిక్షణ తీసుకుని, బాగా శ్రమ పడితే తప్ప కాన్ఫిడెంట్‌గా స్కేటింగ్ చేయలేరు

Viral Video: పద్ధతిగా చీర కట్టుకుని మరీ ఈ మహిళ చేసిన ఫీట్‌కు నెటిజన్లు ఫిదా..!

స్కేటింగ్ చేయడం అనేది చాలా పెద్ద టాస్క్. ఎంతో శిక్షణ తీసుకుని, బాగా శ్రమ పడితే తప్ప కాన్ఫిడెంట్‌గా స్కేటింగ్ చేయలేరు. బ్యాలెన్స్ చేయడం సరిగ్గా రాకపోతే ప్రమాదాల బారిన కూడా పడతారు. అలాంటిది ఓ మహిళ పద్ధతిగా చీర కట్టుకుని మరీ నడిరోడ్డు మీద స్కేటింగ్ చేసింది. ఎదురుగా వాహనాలు వస్తున్నా, చాలా ఆత్మవిశ్వాసంతో స్కేటింగ్ చేసింది. 


లారిసా అనే మహాళా ట్రావెల్ ఇన్‌ఫ్లుయెన్సర్ ఈ ఫీట్ చేసింది. చీర ధరించి ఆమె రోడ్డుపై స్కేటింగ్ చేస్తుండడాన్ని చూసిన వారు ఆశ్చర్యపోయారు. ఆ వీడియోను లారిసా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. `నేను ఇది చేస్తున్నప్పుడు నన్ను చూసి కొందరు ఆశ్చర్యపోయారు. కొంత మంది సెల్ఫీలు కూడా తీసుకున్నారు. చీర కట్టుకున్నప్పుడు స్కేటింగ్ చేయడం అంత సులభం కాద`ని లారిసా కామెంట్ చేశారు. కాగా, ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే 1.27 లక్షల మంది ఆ వీడియోను చూశారు.    



Updated Date - 2022-06-08T17:32:06+05:30 IST