35 ఏళ్లకే రిటైర్ అయిన మహిళ... రూ.10 కోట్లు ఆదా చేసి, వడ్డీ డబ్బులతో విహారయాత్రలు చేస్తూ, కోట్లు కూడ బెట్టే ఐడియాలు చెబుతోంది

ABN , First Publish Date - 2021-09-29T18:10:27+05:30 IST

సగటు మనిషి డబ్బు సంపాదన కోసం తన జీవితాన్నంతా...

35 ఏళ్లకే రిటైర్ అయిన మహిళ... రూ.10 కోట్లు ఆదా చేసి, వడ్డీ డబ్బులతో విహారయాత్రలు చేస్తూ, కోట్లు కూడ బెట్టే ఐడియాలు చెబుతోంది

సగటు మనిషి డబ్బు సంపాదన కోసం తన జీవితాన్నంతా ధారపోస్తాడు. అయినప్పటికీ ఒక సామాన్య వ్యక్తి రూ. 10 కోట్లు సంపాదించడం ఎంతో కష్టమైనపని. ఏదైనా మంచి సంస్థలో పనిచేసినా, రిటైర్మెంట్ తరువాత రూ. 10 కోట్లు అందుకోవడమనేది సాధ్యంకాదు. అయితే ఈ వాదనను తప్పని నిరూపించింది ఒక మహిళ. 35 ఏళ్ల వయసుకే రిటైర్ అయిన ఆ మహిళ రూ. 10 కోట్లు ఆదా చేసిచూపింది. అనవసర ఖర్చులను తగ్గించుకుని తాను రూ. 10 కోట్లను ఆదాచేశానని ఆ మహిళ చెబుతోంది. 


ఈ మహిళ పేరు కెటీ డోనెగన్. గడచిన రెండేళ్లుగా ఆమె తన భర్తతో కలసి పలుదేశాల్లో విహరిస్తోంది. ఇప్పుడు ఆమె వయసు 37 ఏళ్లు. యూకేకి చెందిన ఆమె మీడియాతో మాట్లాడుతూ తన తల్లి ఎలిసన్.. టీచర్ అని, తండ్రి క్రిస్... మార్కెట్ రిసెర్చర్ అని తెలిపింది. తాను చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు ఇచ్చిన పాకెట్ మనీని దాచుకునే దానినని, ఇలా దాడుకోవడంలో ఎంతో ఆనందం లభించేదని తెలిపింది. చదువుకుంటున్న సమయంలోనే తాను గంటకు 9 పౌండ్లు(ఒక పౌండు సుమారు 100.82 రూపాయలు) లభించే ఉద్యోగం చేసేదానినని తెలిపింది. ఆ తరువాత 2005లో తమ కుటుంబం కోస్టారికా వెళ్లిపోయిందన్నారు. అక్కడ తనకు ఎలన్‌తో పరిచయం అయ్యిందన్నారు.


ఆ తరువాత యూకే తిరిగివచ్చేశామన్నారు. ఈ సమయంలో తాను అనవసర ఖర్చులు తగ్గించుకున్నానని, తరచూ కొత్త దుస్తులు కొనుగోలు చేయడం మానివేశానని, రెస్టారెంట్లకు వెళ్లడం మానివేశానని, అలాగే అప్పులు చేయలేదని తెలిపారు. 2008లో చదువు పూర్తయ్యాక ఎలన్‌తో పాటు డిపాజిట్ లేని ఇంటికి షిఫ్ట్ అయిపోయామన్నారు. అక్కడ 28,500 పౌండ్ల వేతనంతో ఉద్యోగం లభించిందన్నారు. తన భర్త ఎలన్ టీచింగ్ ఫ్రొఫషన్‌లో ఉండేవారన్నారు. అప్పుడు ప్యాకెట్ ఫుడ్ తినేవారమని, కొత్త కారు కొనకుండా ఉన్నవాహనం వాడేవారమన్నారు. భారీగా ఖర్చయ్యే నైట్ అవుట్‌లకు వెళ్లేవారం కాదని. డబ్బు ఆదా చేసుకునేందుకు ఇంటిలోనే పార్టీలు చేసుకునేవారమని కెటీ తెలిపారు. ఈ విధంగా ఆమె రెండేళ్లకే 42 వేల పౌండ్లు ఆదా చేశారు. ఆ తరువాత 167,650 పౌండ్లతో డబుల్ బెడ్‌రూం ఫ్లాట్‌కు డిపాజిట్ ఇచ్చారు. 2013లో కెటీ, ఎలన్ వివాహం చేసుకున్నారు. అతి తక్కువ ఖర్చతో కమ్యూనిటీ హాలు బుక్ చేసుకుని, స్నేహితులకు, బంధువులకు ఈ మెయిల్ ద్వారా ఆహ్వానాలు పంపారు. 2018 నాటికి వారు 898,00 పౌండ్లు ఆదా చేశారు. ఈమెత్తాన్ని వారు ఇన్వెస్ట్ చేశారు. 2018 మార్చి, 2019 ఏప్రిల్ మధ్యకాలంలో వారు ఒక మిలియన్ పౌండ్ల టార్గెట్ పూర్తి చేశారు. ఇప్పుడు వారికి ఈ ఇన్వెస్ట్‌మెంట్ నుంచి ఏడాదికి 65 పౌండ్ల ఆదాయం వస్తోంది. ఈ నేపధ్యంలో ఎలన్ ఉద్యోగం మానివేశాడు. ఇప్పుడు వీరిద్దరూ వేర్వేరుగా వివిధ దేశాల్లో పర్యటనలు సాగిస్తున్నారు. ఇప్పటికీ వారు అనవసర ఖర్చుల జోలికి వెళ్లడం లేదు. అందరూ తమ మాదిరిగానే డబ్బులను ఆదా చేసుకోవాలని ఆ దంపతులు సూచిస్తున్నారు. 

Updated Date - 2021-09-29T18:10:27+05:30 IST