మరీ ఇంత దారుణమా..? కడుపులో బిడ్డ మరణించిందని ఆ 3 నెలల గర్భిణికి చెప్పిన డాక్టర్లు.. కానీ చివరకు..

ABN , First Publish Date - 2022-06-01T17:55:47+05:30 IST

ఆ మహిళ మూడు నెలల గర్భిణి.. సోమవారం ఆమెకు కడుపు నొప్పి రావడంతో హాస్పిటల్‌కు వెళ్లింది..

మరీ ఇంత దారుణమా..? కడుపులో బిడ్డ మరణించిందని ఆ 3 నెలల గర్భిణికి చెప్పిన డాక్టర్లు.. కానీ చివరకు..

ఆ మహిళ మూడు నెలల గర్భిణి.. సోమవారం ఆమెకు కడుపు నొప్పి రావడంతో హాస్పిటల్‌కు వెళ్లింది.. ఆమెను పరీక్షించిన వైద్యులు కడుపులోని పిండంలో చలనం లేదని, వెంటనే ఆపరేషన్ చేసి బయటకు తీయకపోతే మహిళ ప్రాణానికి ప్రమాదం అని చెప్పారు.. దీంతో ఆ మహిళ రూ.25 వేలు చెల్లించి ఆపరేషన్ చేయించుకుంది.. ఆపరేషన్ చేసి గర్భంలోని పిండాన్ని బయటకు తీసేశామని, ఆ మహిళకేం ప్రమాదం లేదని చెప్పి వైద్యులు ఆమెను ఇంటికి పంపేశారు.. అయితే తర్వాతి రోజు ఆ మహిళ బాత్రూమ్‌కు వెళ్లగా లోపలి నుంచి పిండం బయటపడింది.. షాకైన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 


ఇది కూడా చదవండి..

స్టార్ హోటల్‌.. 8వ అంతస్తులోని ఓ బాత్రూంను శుభ్రం చేసేందుకు వెళ్లిన సిబ్బంది.. డస్ట్‌బిన్‌లో చూస్తే..


రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో ఉన్న హోలీ ఫ్యామిలీ హాస్పిటల్ వైద్యుడు నిర్లక్ష్యంగా వ్యవహరించాడని ఆరోపిస్తూ మంగళవారం రాత్రి 3 నెలల గర్భిణీ స్త్రీ కుటుంబం గొడవ సృష్టించింది. భగవాన్ గంజ్‌లో నివాసం ఉంటున్న యోగేష్ (27), అనే మహిళ 3 నెలల గర్భిణి. మే 30న ఆమెకు కడుపునొప్పి రావడంతో హోలీ ఫ్యామిలీ ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ డాక్టర్ నీలమ్ ఆ మహిళకు పరీక్ష చేసి కడుపులో ఉన్న పిండం చనిపోయిందని, హార్ట్ బీట్ లేదని చెప్పారు.  ఆ పిండాన్ని వెంటనే గర్భం నుంచి తొలగించాలని, లేదంటే మహిళ ప్రాణం కూడా పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. దీంతో బాధిత మహిళ రూ.25 వేలు కట్టి ఆపరేషన్‌కు సిద్ధమైంది.


ఆపరేషన్ అనంతరం మహిళ పూర్తి క్షేమంగా ఉందని, కాస్త విశ్రాంతి తీసుకుంటే చాలని చెప్పి డాక్టర్ ఆమెను ఇంటికి పంపేశారు. బాధిత మహిళ తన ఇంట్లో విశ్రాంతి తీసుకుంటుండగా రాత్రి 7 గంటలకు మళ్లీ కడుపులో నొప్పి వచ్చింది. ఆమె బాత్‌రూమ్‌కి వెళ్లగా ఒక్కసారిగా పిండం బయటకు వచ్చింది. దీంతో ఆమె భయపడి కుటుంబ సభ్యులను పిలిచింది. పిండాన్ని చూసి షాకైన కుటుంబ సభ్యులు హాస్పిటల్ వద్దకు చేరుకుని అలజడి సృష్టించారు. అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. స్థానిక ఎమ్మెల్యే అక్కడకు చేరుకుని వారిని ఓదార్చారు. జరిగిన ఘటన గురించి పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. 

Updated Date - 2022-06-01T17:55:47+05:30 IST