Abn logo
Jul 30 2021 @ 12:48PM

Gurugram: లిఫ్ట్ ఇస్తానని చెప్పి మహిళపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారం

గురుగ్రామ్ : లిఫ్ట్ ఇస్తామని చెప్పి ఓ మహిళను తన క్యాబ్ లో ఎక్కించుకున్న డ్రైవరు నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్లి ఆమెపై అత్యాచారం చేసిన దారుణ ఘటన గురుగ్రామ్ నగరంలో జరిగింది. బాధిత మహిళ ఢిల్లీ ఎంజీ రోడ్డులోని ఫ్యాషన్ బ్రాండ్ అవుట్ లెట్ లో పనిచేస్తోంది.మహిళ రాత్రి 8.16 గంటలకు ఎంజీరోడ్డు మెట్రో స్టేషన్ గేటు వద్ద నిలబడి ఉండగా లిఫ్ట్ ఇస్తానంటూ కారెక్కించుకున్న క్యాబ్ డ్రైవరు నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్లి ఆమెపై అత్యాచారం జరిపాడు.ఢిల్లీ అయానగర్ సరిహద్దుల్లో మహిళను వదిలి క్యాబ్ డ్రైవరు పారిపోయాడు. ఢిల్లీ పోలీసులు బాధిత మహిళను వైద్య పరీక్ష కోసం ఆసుపత్రికి పంపించి  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.