జనసేన కార్యాలయం వద్ద యువతి నిరసన

ABN , First Publish Date - 2022-03-22T01:54:57+05:30 IST

మంగళగిరిలోని జనసేన రాష్ట్ర పార్టీ కార్యాలయం వద్ద బోయ సునీత అనే జనసేన వీరమహిళ సోమవారం నిరసన చేపట్టింది.

జనసేన కార్యాలయం వద్ద యువతి నిరసన

మంగళగిరి: మంగళగిరిలోని  జనసేన రాష్ట్ర పార్టీ కార్యాలయం వద్ద బోయ సునీత అనే జనసేన వీరమహిళ సోమవారం నిరసన చేపట్టింది. జనసేన  పార్టీ నాయకుడు, నిర్మాత బి వాసు నమ్మించి, తనను వాడుకుని మోసం చేశాడని ఆరోపిస్తూ నిరసనకు దిగింది. జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ దృష్టికి తనకు జరిగిన అన్యాయాన్ని తీసుకెళ్లాలనే ఉద్దేశంతో రాష్ట్ర పార్టీ కార్యాలయానికి వచ్చానని తెలిపింది.  తనకు పవన్‌కల్యాణ్‌ తగిన  న్యాయం చేయాలని డిమాండ్‌ చేసింది. తాను జనసేన వీరమహిళను అని, వాసు పార్టీలో క్రియాశీలకంగా పని చేస్తున్నారని, తనకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్‌ చేసింది.

Updated Date - 2022-03-22T01:54:57+05:30 IST