బస్సులో కామాంధుడి చేష్టలు.. అతనికి బుద్ధి చెప్పడానికి ఓ యువతి తెలివిగా ఏం చేసిందంటే?..

ABN , First Publish Date - 2022-04-07T09:03:23+05:30 IST

మహిళల రక్షణ కోసం.. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా.. ఆకతాయిల ప్రవర్తనలో మార్పు రావడం లేదు. ప్రతిరోజు మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులు జరుగుతున్నట్లు మనం వార్తలు చూస్తూనే ఉన్నాం. తాజాగా.. ఒక బస్సులో వెళుతున్న మహిళ పట్ల ఒక ఆకతాయి యువకుడు అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమెపై ఎక్కడపడితే అక్కడ చేతులు వేస్తూ కీచకుడిలా వ్యవహరించాడు. అతనికి ఎలాగైనా బుద్ధి చెప్పడానికి ఆమె తన తెలివిని ప్రదర్శించింది. ఒక సేఫ్టీ పిన్‌తో...

బస్సులో కామాంధుడి చేష్టలు.. అతనికి బుద్ధి చెప్పడానికి ఓ యువతి తెలివిగా ఏం చేసిందంటే?..

మహిళల రక్షణ కోసం.. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా.. ఆకతాయిల ప్రవర్తనలో మార్పు రావడం లేదు. ప్రతిరోజు మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులు జరుగుతున్నట్లు మనం వార్తలు చూస్తూనే ఉన్నాం. తాజాగా.. ఒక బస్సులో వెళుతున్న మహిళ పట్ల ఒక ఆకతాయి యువకుడు అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమెపై ఎక్కడపడితే అక్కడ చేతులు వేస్తూ కీచకుడిలా వ్యవహరించాడు.  అతనికి ఎలాగైనా బుద్ధి చెప్పడానికి ఆమె తన తెలివిని ప్రదర్శించింది. ఒక సేఫ్టీ పిన్‌తో గుచ్చింది. అంతటితో ఆగకుండా అతడిని పోలీసులకు పట్టించడానికి ఆధారాన్ని కూడా రెడీ చేసింది.


వివరాల్లోకి వెళితే.. చెన్నై నగరంలో ఇటీవల బస్సులో ప్రయాణిస్తున్న ఒక 28 ఏళ్ల మహిళను ఆమె తోటి ప్రయాణికుడు లైంగికంగా వేధించాడు. చెన్నై నుంచి వెల్లూరుకు బస్సులో ప్రయాణిస్తున్న ఆ మహిళను ఆమె వెనుక సీటులో కూర్చున్న యువకుడు అనుచితంగా ఆమెను తాకాడు. ముందు ఆ మహిళ ఏదో పొరపాటున జరిగిందని భావించింది. కానీ ఆ కామాంధుడు మరోసారి ఆమె నడుమును వెనుక నుంచి తాకాడు. ఈ సారి ఆమెకు విషయం అర్ధమైంది. ఆ ఆకతాయికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంది.


ఆ ఆకతాయి ఆమెపై మరోసారి చేయి వేసేంతవరకు ఎదురుచూసింది. ఈసారి అతను చేయి వేస్తూనే అతనికి తన వద్ద ఉన్న సేఫ్టీ పిన్‌తో గుచ్చింది. ఈ ఘటనని ఆ మహిళ తన ఫోన్‌లో వీడియో రికార్డ్ చేసింది. ఆ తరువాత బస్సులో అందరికీ అతని గురించి చెప్పి బస్సును పోలీస్ స్టేషన్ వైపుకు తీసుకెళ్లింది. ఈ విషయంలో ఆమెకు బస్సు సిబ్బంది కూడా సహకరించారు.


ఆ కామాంధుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసి.. తన వద్ద ఉన్న వీడియోని ఆధారంగా చూపింది. ఆమె ఫిర్యాదుపై పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.




వివరాల్లోకెళ్తే.. తమిళనాడులోని చెన్నైలో ప్రభుత్వ బస్సులో ప్రయాణిస్తున్న 28 ఏళ్ల యువతి లైంగిక వేధింపులకు గురైంది. త‌న తోటి ప్ర‌యాణికుడు ఆమె ప‌ట్ల అనుచితంగా ప్ర‌వ‌ర్తించాడు. ఓ యువ‌తి చెన్నై నుంచి వెల్లూరుకు బస్సులో ప్ర‌యాణిస్తుంది. ఈ క్ర‌మంలో త‌న వెనుకల కూర్చున్న ఓ  ఆకతాయి.. ఆ యువ‌తిని అనుచితంగా తాకేందుకు ప్రయత్నించాడు. తొలుత ఏదో పొర‌పాటున జ‌రగ‌వ‌చ్చ‌న‌ని భావించిన ఆ యువ‌తి ప‌ట్టించుకోకుండా విడిచి పెట్టింది. ఆ యువ‌తి త‌న‌ని ఏం అన‌డం లేదుగా అని మ‌రోసారి అనుచితంగా తాక‌డానికి ప్ర‌య‌త్నించాడు. దీంతో ఆగ్ర‌హానికి లోనైనా స‌ద‌రు మ‌హిళ‌.. ఆ కామంధుడిని సేఫ్టీ పిన్‌తో ఎదుర్కుంది. ఆ ఘటన మొత్తాన్ని త‌న ఫోన్ లో రికార్డు చేసింది ఆ మహిళ. అనంత‌రం ఆ కామాంధుడిని అరెస్ట్ చేయాలని పోలీసులను ఆశ్రయించింది. నిందితుడిని కృష్ణగిరికి చెందిన రాఘవన్ (40)గా గుర్తించారు.


చెన్నైలోని కోయంబేడు బస్టాండ్ ఎక్కిన ఆ నిందితుడు త‌న వెనుక సీటులో కూర్చోని వేధించడం ప్రారంభించాడని, మొదట్లో పొరపాటున తాకాడని భావించ‌న‌ని..కాసేపటి తర్వాత సీటు వెనుక నుంచి చేతులు జారి ఆమెను అనుచితంగా తాకేందుకు ప్రయత్నించాడ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసింది. ఆమె సమస్యను లేవనెత్తినప్పుడు.. కొంతమంది ప్రయాణీకులు తమ‌కు ఆలస్యం అవుతుంద‌ని, త‌న‌ను, నిందితుడిని బస్సు నుండి దిగమని ప్ర‌యాణికులు సూచించారని తెలిపింది. త‌న‌పై లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డ్డడ‌నే దానికి సాక్ష్యంగా ఆ వీడియోను చిత్రీకరించానని ఆమె తెలిపింది. ఇలాంటి సంఘటనలు జరగకుండా పాయింట్ టు పాయింట్ బస్సుల్లో బస్సు కండక్టర్లను నియమించాలని ఆమె రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. బాధితురాలు ఫిర్యాదు మేర‌కు నిందితులను అదుపులోకి తీసుకున్న‌మ‌ని పోలీసులు తెలిపారు.  


Updated Date - 2022-04-07T09:03:23+05:30 IST