Abn logo
Sep 19 2021 @ 12:25PM

ఆమె ముగ్గురు పిల్లల తల్లి.. ప్రియుడి మోజులో పడి కట్టుకున్న వాడినే కడతేర్చేందుకు భారీ ప్లాన్.. పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్!

ఇంటర్నెట్ డెస్క్: ఆమె ముగ్గురి పిల్లల తల్లి. ప్రియుడి మోజులో పడి.. కట్టుకున్నవాడినే కడతేర్చేందుకు భారీ ప్లాన్ వేసింది. ఎవ్వరికీ అనుమానం రాకుండా.. పక్కాగా ప్లాన్‌ను అమలు చేసింది. ఏమీ తెలియనట్లు.. నాటకాలు ఆడింది. అయితే పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్ అయింది. ఆమె చేసిన పని.. బట్టబయలైంది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆ మహిళను కటకటాల్లోకి నెట్టారు. బిహార్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. 


మధుబాని జిల్లాలోని భైరావంత్ గ్రామ శివార్లలో ఈ నెల 15న పోలీసులు.. ఓ వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు. అనంతరం విచారణ చేపట్టి.. హత్యకు గురైంది భగవతిపూర్ గ్రామానికి చెందిన మహ్మద్ మషూక్‌గా గుర్తించి, అతని భార్యకు సమాచారం అందించారు.  భర్త మరణ వార్తను పోలీసుల ద్వారా తెలుసుకున్న నసీమా ఖాటూన్.. పుట్టెడు దు:ఖాన్ని నటించింది. మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తైన తర్వాత.. శవాన్ని పోలీసులు నసీమాకు అప్పగించారు. ఆ తర్వాత అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయి. అయితే ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. ఏ ఒక్కరినీ వదలకుండా కుటుంబ సభ్యులందరినీ విచారించారు. ఈ క్రమంలో వారికి నసీమా వైఖరిపై అనుమానం కలిగింది. దీంతో ఆమెను అదుపులోకి తీసుకుని.. తమదైన స్టైల్‌లో విచారించారు. దీంతో ఆమె తన తప్పు ఒప్పుకుంది. తన భర్త హత్య కుట్రలో తనకు భాగం ఉన్నట్టు వెల్లడించింది.  


ఈ నేపథ్యంలో తాజాగా మీడియా సమావేశం ఏర్పాటు చేసిన పోలీసులు.. కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. నసీమా, మహ్మద్ మషూక్‌కు కొన్నేళ్ల క్రితం వివాహం జరిగిందని.. ఈ క్రమంలో వారికి ముగ్గురు పిల్లలు కూడా పుట్టారని వెల్లడించారు. అయితే వీరి మధ్య మనస్పర్ధలు రావడంతో.. నసీమా తన బంధువైన మహ్మద్ సోను అనే 18 ఏళ్ల కుర్రాడికి దగ్గరైందని చెప్పారు. దీంతో సోను తరచుగా నసీమా ఇంటికి వచ్చిపోయేవాడని పేర్కొన్నారు. ఈ క్రమంలో సోను కారణంగా భార్యభర్తల మధ్య మరింత దూరం పెరిగినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరి మధ్య గొడవలు కూడా జరిగాయని వెల్లడించారు. దీంతో నసీమా.. తన ప్రియుడు సోను‌తో కలిసి భర్తను చంపడానికి ప్రణాళికలు రచించినట్లు చెప్పారు. ప్లాన్ ప్రకారమే సోను తన స్నేహితుల ద్వారా మహ్మద్ మషూక్‌ను మద్యం తాగడానికి పిలిపించాడని.. ఆ తర్వాత మత్తులో ఉన్న మషూక్‌ను దారుణంగా పొడిచి చంపేశారని వివరించారు. తమ విచారణలో నసీమానే ఈ విషయాలను చెప్పినట్లు పేర్కొన్నారు. కాగా.. నసీమా తల్లి కూడా ఈ హత్యకు సహకరించినట్లు తమ దర్యాప్తు తేలిందని పోలీసులు చెప్పారు. దీంతో హమ్మద్ మషూక్ హత్యలో భాగమైన వారందరిపై కేసు నమోదు చేసి, జైలుకు తరలించినట్లు పోలీసులు వివరించారు. 


ప్రత్యేకంమరిన్ని...