ఆపరేషన్ బెడ్‌పై క్యాన్సర్ పేషెంట్ కచేరి! కథేంటంటే..

ABN , First Publish Date - 2020-02-20T02:05:45+05:30 IST

ఇటువంటి ప్రమాదంలో పడకుండా ఉండేందుకు ఓ మహిళతో ఆపరేషన్ సమయంలో వయోలిన్ వాయించారు డాక్టర్లు.

ఆపరేషన్ బెడ్‌పై క్యాన్సర్ పేషెంట్ కచేరి! కథేంటంటే..

లండన్: మెదడు ఆపరేషన్లు చాలా సంక్లిష్టమైనవి. ఆపరేషన్ తరువాత.. కొన్ని సందర్భాల్లో పేషెంట్లు తమ నైపుణ్యాలను కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. ఇటువంటి ప్రమాదంలో పడకుండా ఉండేందుకు ఓ మహిళతో ఆపరేషన్ సమయంలో వయోలిన్ వాయించారు డాక్టర్లు. పూర్తి వివరాల్లోకి వెళితే.. బ్రిటన్‌కు చెందిన డాగ్మార్ టర్నర్ అనే మహిళ తన మెదడులోని క్యాన్సర్ కణితి కారణంగా నరకం అనుభవిస్తోంది. అయితే ఆపరేషన్ ద్వారా కణితిని తొలగించడమే దినికి తగిన పరిష్కారమని డాక్టర్లు భావించారు. దీనికి సరేనన్న ఆమె.. ఇటీవల ఆపరేషన్ చేయించుకుంది. అయితే డాగ్మార్‌కు వయోలిన్ అంటే ప్రాణం. ఆపరేషన్ సందర్భంగా వయోలిన్ వాయించే నైపుణ్యాన్ని కోల్పోయే అవకాశం ఉండటంతో డాక్టర్లు.. ఆపరేషన్ సందర్భంగా వయోలిన్ వాయించమని సూచించారు. డాక్టర్ల ముందు చూపు కారణంగా.. మెదడులోని ట్యూమర్ తొలగిపోవడమే కాకుండా వైయోలిన్ నైపుణ్యాలు కూడా చెక్కుచెదరలేదు. దీంతో ఆమె సంబరపడిపోతూ డాక్టర్లకు ధనవ్యాదాలు తెలిపింది.  

Updated Date - 2020-02-20T02:05:45+05:30 IST