విమానంలో ఆ మహిళ తీరుపై ట్రోలింగ్.. చెత్త పాసింజర్ అంటూ నెటిజన్లు ఫైర్!

ABN , First Publish Date - 2022-06-30T23:37:42+05:30 IST

బస్సు కాని, రైలు కాని, విమానం కాని.. ప్రజా రవాణా వ్యవస్థకు చెందిన వాహనంలో ప్రయాణిస్తున్నప్పుడు ఎవరైనా కాస్త హుందాగా ప్రవర్తించాలి.

విమానంలో ఆ మహిళ తీరుపై ట్రోలింగ్.. చెత్త పాసింజర్ అంటూ నెటిజన్లు ఫైర్!

బస్సు కాని, రైలు కాని, విమానం కాని.. ప్రజా రవాణా వ్యవస్థకు చెందిన వాహనంలో ప్రయాణిస్తున్నప్పుడు ఎవరైనా కాస్త హుందాగా ప్రవర్తించాలి. తమ వల్ల పక్క వారు ఇబ్బంది పడకుండా చూసుకోవాలి.. అయితే విమానంలో ప్రయాణిస్తున్న ఓ మహిళ అత్యంత మూర్ఖంగా ప్రవర్తించింది.. ఇతర ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగించింది.. విమానంలో ఆ మహిళ కూర్చున్న తీరును ఆమె పక్కనే కూర్చున్న పాల్ స్టోథార్డ్ అనే వ్యక్తి ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. 


ఇది కూడా చదవండి..

రూటు మార్చిన సైబర్ నేరగాళ్లు.. కరెంట్ బిల్లు కట్టలేదంటూ ఫోన్లు.. కనెక్షన్ కట్ చేస్తామని భయపెట్టి రూ.60 వేలు స్వాహా..!


పాల్ స్టోథార్డ్ అనే వ్యక్తి ఎమిరేట్స్‌ విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు, తన ముందు సీటుపై అపసవ్యంగా కూర్చున్న మహిళను గుర్తించాడు. వెంటనే ఆమె ఫొటో తీసి `విమానంలో నా పక్కన ఉన్న వ్యక్తి` అనే కామెంట్‌తో ఆ ఫొటోను ట్వీట్ చేశాడు. ఆ ఫొటోలో మహిళా ప్రయాణీకురాలు.. ఒక జత బరువైన బూట్‌లను ధరించి, తన పాదాలను తన ముందు ఉన్న సీటు హెడ్‌రెస్ట్‌పై పెట్టింది. ఆ ముందు సీటులో కూర్చున్న ప్రయాణీకుడి తలకి కేవలం అంగుళం దూరంలో తన పాదాలను పెట్టింది. ఈ ఫొటోపై నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు. ఆమె చాలా చెత్త ప్రయాణికురాలు అని కామెంట్లు చేస్తున్నారు.   

Updated Date - 2022-06-30T23:37:42+05:30 IST