మహిళ అవయవ దానం

ABN , First Publish Date - 2022-07-03T04:58:43+05:30 IST

బ్రెయిన్‌ డెడ్‌తో చనిపోయిన జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రానికి చెందిన చరిత(30) అవయవాలను కుటుంబ సభ్యులు శనివారం దానం చేశారు. పట్టణానికి చెందిన శివన్న కూతురు చరిత గత నెల 29న అనారోగ్యానికి గురైంది.

మహిళ అవయవ దానం

 గద్వాల అర్బన్‌, జూలై 2: బ్రెయిన్‌ డెడ్‌తో చనిపోయిన జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రానికి చెందిన చరిత(30) అవయవాలను కుటుంబ సభ్యులు శనివారం దానం చేశారు. పట్టణానికి చెందిన శివన్న కూతురు చరిత గత నెల 29న అనారోగ్యానికి గురైంది. కుటుంబ సభ్యులు గద్వాల జిల్లా ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడి వైద్యుల సలహా మేరకు మెరుగైన చికిత్స కోసం కర్నూలు కిమ్స్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. బ్రెయిన్‌ డెడ్‌ వ్యాధికి గురైనట్లు వైద్యులు తెలిపారు. పరిస్థితి విషమించడంతో ఆమె శనివారం చనిపోయింది. భర్త శ్రీధర్‌, కుటుంబ సభ్యుల కోరిక మేరకు ఆమె అవయవాలను దానం చేసేందుకు సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న హైదరాబాద్‌కు చెందిన జీవన్‌దాన్‌ సంస్థ వారు చరిత కళ్లు, కలేయం, కిడ్నీలు, ఊపిరితిత్తులు స్వీకరించింది. ఊపిరితిత్తులను పుణెకు చెందిన అబ్బాయికి అమర్చేందుకు పంపించారని కుటుంబ సభ్యులు తెలిపారు.  అవయవాల దానం పట్ల కుటుంబ సభ్యులను డాక్టర్లు, పట్టణ ప్రజలు అభినందించారు.

Updated Date - 2022-07-03T04:58:43+05:30 IST