Viral Video: ఈ వీడియోను చూసి కూడా ఈ మహిళ ఫోన్‌ను ఎవరైనా ముట్టుకోగలరా..?

ABN , First Publish Date - 2022-05-06T20:40:29+05:30 IST

నెట్టింట ప్రస్తుతం ఓ మహిళకు చెందిన వీడియో చక్కర్లు కొడుతూ ఉంది. అది చూసి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. ‘ఈ వీడియో చూసిన తర్వాత కూడా ఈ మహిళ ఫోన్‌ను ఎవరైనా ముట్టుకోగలరా?’ అంటూ

Viral Video: ఈ వీడియోను చూసి కూడా ఈ మహిళ ఫోన్‌ను ఎవరైనా ముట్టుకోగలరా..?

ఇంటర్నెట్ డెస్క్: నెట్టింట ప్రస్తుతం ఓ మహిళకు చెందిన వీడియో చక్కర్లు కొడుతూ ఉంది. అది చూసి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. ‘ఈ వీడియో చూసిన తర్వాత కూడా ఈ మహిళ ఫోన్‌ను ఎవరైనా ముట్టుకోగలరా?’ అంటూ కామెంట్లు కురిపిస్తున్నారు. ఫోన్ ముట్టుకోవడానికి పక్కవాళ్లు కూడా భయపడేంతలా ఆ మహిళ చేసిన ఘనకార్యం ఏంటో తెలుసుకోవాలంటే పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే.



సేఫ్టీ దృష్ట్యా సాధారణంగా అందరూ తమ ఫోన్‌లకు రకరకాల పద్ధతుల్లో లాక్‌లు వేసుకుంటారు. తిరిగి మొబైల్ ఫోన్ లాక్ ఓపెన్ చేయడానికి, పాస్‌వర్డ్‌లను కానీ లేదా ఫేస్ రికగ్నేషన్ సిస్టమ్‌ను కానీ ఉపయోగిస్తారు. కానీ ఓ మహిళ మాత్రం ఎవ్వరూ ఊహించని విధంగా వినూత్న పద్ధతిలో తన మొబైల్‌ను అన్‌లాక్ చేసింది. ఫ్లోరిడాకు చెందిన మిలా మోనెట్ అనే మహిళ టిక్‌టాక్‌లో చాలా ఫేమస్. పలు సోషల్ మీడియా అకౌంట్లలో ఆమెకు చాలా మంది ఫాలోవర్లు ఉన్నారు. ఈమె తాజాగా తన ఐఫోన్‌ను నోటి ఉమ్ముతో అన్‌లాక్ చేసింది. నోటి నుంచి ఫోన్ కీప్యాడ్‌పై ఉమ్మును జార విడుస్తూ పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేసి, ఫోన్‌ను అన్‌లాక్ చేసింది. అంతేకాకుండా అందుకు సంబంధించిన దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ప్రస్తుతం ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. అది చూసి నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 




Updated Date - 2022-05-06T20:40:29+05:30 IST

Read more