ముస్లిం ఆటోడ్రైవర్‌తో 40 ఏళ్ల హిందూ మహిళ ప్రేమాయాణం.. చివరికి ఏం జరిగిందంటే..

ABN , First Publish Date - 2021-10-06T11:44:38+05:30 IST

రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని కొనోతా ప్రాంతంలో నివసించే ఉగంతీ దేవి(40) అనే మహిళ పావురాల దాణా వ్యాపారం చేసేది. ఒక సంవత్సరం క్రితం ఆమె భర్త చనిపోయాడు..

ముస్లిం ఆటోడ్రైవర్‌తో 40 ఏళ్ల హిందూ మహిళ ప్రేమాయాణం.. చివరికి ఏం జరిగిందంటే..

రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని కొనోతా ప్రాంతంలో నివసించే ఉగంతీ దేవి(40) అనే మహిళ పావురాల దాణా వ్యాపారం చేసేది. ఒక సంవత్సరం క్రితం ఆమె భర్త చనిపోయాడు. ఆమెకు 14 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. ప్రతిరోజూలాగే ఉగంతీదేవి ఒకరోజు ఇంటి నుంచి తన షాపుకి బయలుదేరింది. అలా వెళ్లిన ఆమె మళ్లీ తిరిగి రాలేదు. తన తల్లి కనపడడం లేదని ఆమె కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరుసటి రోజు ఒక నిర్మానుష్య ప్రాంతంలో ఉగంతీ దేవి శవమై తేలింది.

పోలీసులు ఈ హత్య కేసుని సీరియస్‌గా తీసుకున్నారు. ఉగంతీ దేవి గురించి అన్ని విధాలా సమాచారం సేకరించారు. విచారణలో భాగంగా ఆమె బంధువులు, ఇరుగుపొరుగు వారు అందరినీ ఉంగతీ దేవి గురించి అడిగారు. కానీ ఎవరిపైనా అనుమానం రాలేదు. చివరికి ఆమె ప్రతిరోజూ ఒకే ఆటోలో ఇంటి నుంచి షాపుకు వెళ్లే దని, తిరిగి అదే ఆటోలో వచ్చేదని దర్యాప్తులో తెలిసింది.

ఆ ఆటోడ్రైవర్ గురించి ఆరాతీయగా అతను పరారీ ఉన్నట్లు తెలిసింది. వెంటనే పోలీసులు అతని మొబైల్ ఫోన్ కాల్ డేటా ఆధారంగా అతడిని వెతకడం ప్రారంభించారు. జైపూర్ పరిసరి ప్రాంతాలలో టోల్ గేట్ సిసిటీవి ఫుటేజి సహాయంతో అతడిని చివరికి పట్టుకున్నారు. పోలీసులు అతడిని విచారణ చేయగా నిజం బయటపడింది.


పోలీసుల కథనం ప్రకారం.. పావురాల దాణా వ్యాపారం చేసే ఉగంతీ దేవి(40)కి ఒక అటో డ్రైవర్ అయిన అలీ ముహమ్మద్(45) అలియాస్ కల్లూతో ప్రేమ వ్యవహారం ఉంది. ప్రతిరోజూ కల్లూ తన అటోలో ఆమెను తీసుకెళ్లూ వస్తూ ఉండేవాడు. అలా వారి మధ్య పరిచయం మొదలైంది. ఆ పరిచయం ప్రేమగా మారింది. ప్రతిరోజు ఇంటి నుంచి ఆటో ప్రయాణం చేస్తూ వారిద్దరూ ప్రేమ ముచ్చట్లు చెప్పుకునేవారు. అప్పుడప్పుడూ ఇద్దరూ కలిసి మద్యం సేవించేవారు. ఉగంతీ దేవి భర్త చనిపోవడంతో వారిద్దరి ప్రేమకు అడ్డు లేకుండా పోయింది.

అంతా బాగుందనుకున్న సమయంలో ఆటోడ్రైవర్ కల్లూ.. డబ్బు అవసరం ఉండి ఉగంతీ దేవి వద్ద అప్పు తీసుకున్నాడు. తీసుకున్న అప్పు తిరిగివ్వకపోవడంతో అతని ఆటోని ఆమెకే ఇచ్చేశాడు. ఆ తరువాత కల్లు ఒక కిరాయి ఆటో నడిపేవాడు. అప్పు పూర్తిగా అయిపోలేదని, ఇంకా రూ.20 వేలు బకాయి ఉందని ఉగంతీ దేవి కల్లూపై ఒత్తిడి చేసేది. ఈ విషయంలో వారిద్దరి మధ్య చిన్న గొడవ జరిగింది. ఉగంతీ దేవి అత్యాశ పడడంతో కల్లూకి కోపం వచ్చింది. ఒకరోజు ఆమెను షాపు నుంచి ఇంటకి తీసుకువస్తూ కాసేపు ఒంటరిగా మాట్లాడుదాం అని ఎవరూ లేని ప్రాంతానికి ఆమెను తీసుకెళ్లాడు. అక్కడ ఒక బండతో ఉగంతీ దేవి తలపై కొట్టాడు. ఆమె స్పృహ కోల్పోయిన తరువాత గొంతు కోసి పక్కనే ఉన్న పొదల చాటున పడేశాడు. 


Updated Date - 2021-10-06T11:44:38+05:30 IST