Abn logo
Mar 4 2021 @ 02:28AM

మహిళపై హత్యాచారం?.. మెదక్‌లో దారుణం

మెదక్‌ అర్బన్‌, మార్చి 3: ఓ మహిళపై అత్యాచారం.. హత్య చేసిన సంఘటన మెదక్‌లో మంగళవారం రాత్రి జరిగింది. మృతురాలి కుటుంబీకులు, పోలీసులు తెలిపిన వివరాలు.. స్థానిక బ్రాహ్మణ వీధిలో ఓ మహిళ(47) ఇల్లు అద్దెకు తీసుకుని ఒంటరిగా ఉంటోంది. రాందాస్‌ చౌరస్తాలో టీ కొట్టు నడుపుకుంటూ జీవిస్తోంది. ఈ క్రమంలో మంగళవారం రాత్రి మహిళపై గుర్తు తెలియని దుండగులు అత్యాచారానికి పాల్పడి రోకలి బండతో కొట్టి దారుణంగా హత్య చేశారు. ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు.

Advertisement
Advertisement
Advertisement