Haryana: మహిళపై కానిస్టేబుల్ దారుణం.. వీడియో చూపించి బెదిరిస్తూ ఆరేళ్లుగా అత్యాచారం.. చివరకు..

ABN , First Publish Date - 2022-08-22T02:38:07+05:30 IST

న్యాయం కోసం పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన ఓ మహిళపై కానిస్టేబుల్ కన్నేశాడు.. రక్షించాల్సిన వ్యక్తే.. ఆమె పాలిట భక్షకుడిగా మారాడు.

Haryana: మహిళపై కానిస్టేబుల్ దారుణం.. వీడియో చూపించి బెదిరిస్తూ ఆరేళ్లుగా అత్యాచారం.. చివరకు..

న్యాయం కోసం పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన ఓ మహిళపై కానిస్టేబుల్ కన్నేశాడు.. రక్షించాల్సిన వ్యక్తే.. ఆమె పాలిట భక్షకుడిగా మారాడు.. ఆమెకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేశాడు.. ఆ ఘటనను వీడియో తీశాడు.. అది చూపించి బెదిరిస్తూ ఆరేళ్లుగా ఆ మహిళపై అత్యాచారానికి పాల్పడుతున్నాడు.. అతడి అకృత్యాలను భరించలేకపోయిన మహిళ చివరకు మహిళా పోలసులను ఆశ్రయించింది. హర్యానా(Haryana)లోని జింద్‌లో ఈ ఘటన జరిగింది. 


ఇది కూడా చదవండి..

Viral Video: ప్రేయసికి ప్రపోజ్ చేస్తున్న సమయంలో అనుకోని సంఘటన.. చివరకు ఏం జరిగిందంటే..


హర్యానాలోని జులనా పోలీస్ స్టేషన్‌కు ఓ మహిళ 2016లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లింది. అక్కడ పనిచేస్తున్న కానిస్టేబుల్ విజయ్‌ ఆమెతో పరిచయం పెంచుకున్నాడు.  ఆమెతో స్నేహం చేసి ఇంటికి కూడా వెళ్లేవాడు. ఒక రోజు మత్తు మందు ఇచ్చి ఆమెను అత్యాచారం చేశాడు. ఆ ఘటనను వీడియో తీశాడు. ఆ వీడియోతో ఆమెను బ్లాక్ మెయిల్ చేస్తూ ఆరేళ్లుగా అత్యాచారం చేస్తున్నాడు. ఇటీవల బాధిత మహిళ స్థానిక మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. 


బాధితురాలి ఫిర్యాదు మేరకు మహిళా పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్ విజయ్‌పై దాడి, మాదక ద్రవ్యాలు ఇవ్వడం, ఇంట్లోకి ప్రవేశించి లైంగికంగా వేధించడం వంటి నేరాల కింద కేసులు నమోదు చేశారు. అతడిని అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. 

Updated Date - 2022-08-22T02:38:07+05:30 IST