మైనర్ బాలుడితో మహిళ Affair.. రాత్రి సమయంలో భర్తకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోవడంతో..

ABN , First Publish Date - 2022-07-12T21:35:29+05:30 IST

ఆ మహిళ వయసు 35 సంవత్సరాలు.. వివాహిత అయిన ఆమె FaceBookలో ఎక్కువ సమయం గడుపుతుండేది.

మైనర్ బాలుడితో మహిళ Affair.. రాత్రి సమయంలో భర్తకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోవడంతో..

ఆ మహిళ వయసు 35 సంవత్సరాలు.. వివాహిత అయిన ఆమె FaceBookలో ఎక్కువ సమయం గడుపుతుండేది.. ఆమెకు కొన్ని రోజుల క్రితం ఫేస్‌బుక్‌ ద్వారా 15 ఏళ్ల బాలుడితో పరిచయం ఏర్పడింది.. ఇద్దరూ గంటల తరబడి ఛాటింగ్ చేసుకునేవారు.. ఇద్దరి మధ్య శారీరక సంబంధం కూడా ఏర్పడింది.. ఇటీవల తన ఇంట్లో బాలుడితో ఆమె శృంగారం సాగిస్తూ భర్తకు రెండ్ హ్యాండెడ్‌గా దొరికిపోయింది. దీంతో అతను ఇద్దరినీ బయటకు లాక్కెళ్లి చితక్కొట్టాడు.. గ్రామస్తులు పంచాయితీ నిర్వహించి బాలుడి నుంచి లిఖితపూర్వక హామీ తీసుకున్నారు. 


ఇది కూడా చదవండి..

Crime: మహిళపై అమానుషం.. నడిరోడ్డుపై వివస్త్రను చేసి చితక్కొట్టిన భర్త, అత్తమామలు..


బీహార్‌లోని జముయి జిల్లాలోని హర్లా గ్రామానికి చెందిన 35 ఏళ్ల మహిళకు తన పక్క గ్రామానికి చెందిన ఓ స్టూడెంట్(15)తో ఫేస్‌బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. కొద్ది రోజుల్లోనే ఆ పరిచయం అఫైర్‌గా మారింది. ఇద్దరూ గంటల తరబడి ఛాటింగ్ చేసుకునేవారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య శారీరక సంబంధం కూడా మొదలైంది. ఈ క్రమంలో ఇటీవల ఆ బాలుడు.. మహిళ ఇంటికి వెళ్లాడు. ఆ రాత్రి తన ఇంట్లోనే ఆ బాలుడితో మహిళ శృంగారం సాగిస్తుండగా భర్త రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. ఇద్దరినీ ఇంట్లో నుంచి బయటకు లాక్కెళ్లి చితక్కొట్టాడు.


విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఆ బాలుడిని దారుణంగా కొట్టారు. ఆ మహిళ ఆ బాలుడిని కాపాడేందుకు ప్రయత్నించింది. అయినా గ్రామస్తులు, ఆ మహిళ భర్త.. ఇద్దరినీ కర్రలతో కొట్టారు. పంచాయితీ పెద్దలు బాలుడి కుటుంబ సభ్యులను పిలిపించి విషయం మొత్తం చెప్పారు. ఇకపై ఆ మహిళతో సంబంధం కొనసాగించకూడదని లిఖితపూర్వక హామీ తీసుకుని ఆ బాలుడిని పంపేసినట్టు తెలిసింది.

Updated Date - 2022-07-12T21:35:29+05:30 IST