నా wife కుమారుడినే పెళ్లాడింది...పోలీసులకు భర్త ఫిర్యాదు

ABN , First Publish Date - 2022-05-19T12:43:06+05:30 IST

తన భార్య కుమారుడిని వివాహం చేసుకుందని సాక్షాత్తూ భర్త పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన...

నా wife కుమారుడినే పెళ్లాడింది...పోలీసులకు భర్త ఫిర్యాదు

రుద్రపూర్ : తన భార్య కుమారుడిని వివాహం చేసుకుందని సాక్షాత్తూ భర్త పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో సంచలనం రేపింది.ఉత్తరాఖండ్‌లోని ఉధమ్‌సింగ్ నగర్‌లోని బాజ్‌పూర్‌ ప్రాంతానికి చెందిన తన భార్య బాబ్లీ కుమారుడిని పెళ్లాడిందని ఇంద్రరామ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన భార్య బాబ్లీకి 11 ఏళ్ల వయసులోనే వివాహం కావడంతో ఆమెకు మొదటి భర్త నుంచి ఇద్దరు కుమారులున్నారని భర్త పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. మొదటి భర్తకు విడాకులిచ్చిన బాబ్లీ తనను రెండో వివాహం చేసుకుందని ఇంద్రరామ్ చెప్పాడు.ఇంద్రరామ్‌, బాబ్లీ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు.తర్వాత బాబ్లీ మొదటి వివాహం వల్ల పుట్టిన ఆమె కుమారుల్లో ఒకరి ఇంటికి వెళ్లడం ప్రారంభించిందని ఇంద్రరామ్ పోలీసులకు సమర్పించిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. 


బాబ్లీ, ఆమె కుమారుడు ఇద్దరూ పెళ్లి చేసుకున్నారని భర్త ఆరోపించాడు. తన ఇంట్లో నుంచి బాబ్లీ రూ.20వేలు తీసుకుని వెళ్లిపోయిందని ఆరోపించాడు.ఈ ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.


Updated Date - 2022-05-19T12:43:06+05:30 IST