భార్య భుజంపై భర్త..ఆమెను కర్రలతో కొట్టిన జనం.. ఇదో శిక్ష అట!

ABN , First Publish Date - 2020-07-31T05:08:34+05:30 IST

అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళకు భర్తను భుజంపై మోస్తూ విధుల వెంట తిరగాల్సిందిగా గ్రామస్థలు శిక్ష వేశారు.

భార్య భుజంపై భర్త..ఆమెను కర్రలతో కొట్టిన జనం.. ఇదో శిక్ష అట!

భోపాల్: అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళకు భర్తను భుజంపై మోస్తూ విధుల వెంట తిరగాల్సిందిగా గ్రామస్థలు శిక్ష వేశారు. మధ్యప్రదేశ్‌లోని జాభువా జిల్లాలోగల ఛప్రీ రన్వాస్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవడంతో విమర్శలు వెల్లువెత్తాయి. మహిళ తన భుజంపై భర్తను మోస్తూ అతికష్టం మీద నడుస్తుండగా.. గ్రామస్థులు, భర్త కుటుంబ సభ్యులు ఆమెను కర్రలతో కొడుతున్న భయానక దృశ్యాలు వీడియోలో రికార్డయ్యాయి. భార్యభర్తలిద్దరూ రోజు కూలీలని, పొరుగు రాష్ట్రమైన గుజరాత్ నుంచి స్వగ్రామానికి ఇటీవలే తిరిగొచ్చారని పోలీసులు తెలిపారు. భార్య అక్రమ సంబంధం పెట్టుకుందని భర్త ఆరోపించడంతో గ్రామస్థులు ఈ శిక్ష విధించారని తెలిపారు. దీనికి సంబంధించి భర్తతో పాటూ మొత్తం ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా.. మధ్యప్రదేశ్‌లోని గిరిజన తెగలు మెజారిటీగా ఉండే కొన్ని జిల్లాల్లో ఇది సర్వసాధారణమని అక్కడి విలేకరి ఒకరు వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ప్రతికూల ప్రభావం చూపుతుందనే ఉద్దేశ్యంతో స్థానిక ప్రజా ప్రతినిధులు కూడా ఇటువంటి మహిళల విషయంలో కలుగ జేసుకునేందుకు జంకుతారని ఆయన తెలిపారు. 

Updated Date - 2020-07-31T05:08:34+05:30 IST