ఈ ఫొటోలో 60 ఏళ్ల వృద్ధురాలిలా కనిపిస్తున్న ఈమె ఎవరో, ఒంటరిగా రోడ్లపై ఎందుకిలా తిరగాల్సి వచ్చిందో తెలిస్తే..

ABN , First Publish Date - 2021-10-02T00:30:28+05:30 IST

మెడలో బంగారం.. ఓ చేతిలో చిన్న కర్ర.. మరో చేతిలో ప్లాస్టిక్ కవర్ పట్టుకుని రోడ్లపై తిరుతున్న మహిళ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 60 ఏళ్ల వయసు ఉన్నట్లు కనిపించే ఆమె.. అమాయకంగా రోడ్లపై తిరుగుతూ పూలు తెంపుతున్న ఫొటోలు నెట్టింట హాట్

ఈ ఫొటోలో 60 ఏళ్ల వృద్ధురాలిలా కనిపిస్తున్న ఈమె ఎవరో, ఒంటరిగా రోడ్లపై ఎందుకిలా తిరగాల్సి వచ్చిందో తెలిస్తే..

ఇంటర్నెట్ డెస్క్: మెడలో బంగారం.. ఓ చేతిలో చిన్న కర్ర.. మరో చేతిలో ప్లాస్టిక్ కవర్ పట్టుకుని రోడ్లపై తిరుతున్న మహిళ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 60 ఏళ్ల వయసు ఉన్నట్లు కనిపించే ఆమె.. అమాయకంగా రోడ్లపై తిరుగుతూ పూలు తెంపుతున్న ఫొటోలు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. ఈ క్రమంలో ఆమె ఎవరు, అలా తిరగడానికి గల కారణం ఏంటన్న అంశంపై నెటిజన్లు సీరియస్‌గా చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమెను గురించి తెలుసుకుని అవాక్కవుతున్నారు. ఇంతకీ పై ఫొటోలు కనిపిస్తున్న మహిళ ఎవరు అనే వివరాల్లోకి వెళితే..


చతీస్‌గఢ్‌లోని పోలీసులకు దొంగల బెడద ఎక్కువైంది. ముఖ్యంగా చైన్ స్నాచర్‌లు వాళ్లకు తలనొప్పిగా మారారు. రోజుల వ్యవధిలోనే పదుల సంఖ్యలో దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు నిద్రను దూరం చేస్తున్నారు. భిలాయ్ ప్రాంతంలో 20 రోజుల్లోనే 6 చైన్ స్నాచింగ్ సంఘటలు చోటు చేసుకోవడంతో పోలీసులపై ఒత్తిడి పెరిగింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఆ ప్రాంతంల్లోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలించారు. ఒకే వ్యక్తి ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో సిటీలోకి ఎంటరై.. 9 గంటల వరకూ తిరుగుతూ పరిసరాలను గమనించిన తర్వాత పని ముగించుకుని వెళ్తున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే.. దొంగను పట్టుకునేందకు భారీ ప్రణాళికను సిద్ధం చేశారు. వరుస చోరీలకు పాల్పడుతున్న అతడిని ఎట్టిపరిస్థిల్లో పట్టుకునేందకు కట్టదిట్టమైన భద్రతను సిటీ చుట్టూ మోహరించారు. 



ఈ నేపథ్యంలోనే 25ఏళ్ల ఓ మహిళా పోలీసు అధికారి తన రూపాన్నే మార్చుకున్నారు. మేకప్‌ ద్వారా 60ఏళ్ల బామ్మగా మారిపోయి.. రోడ్డుపైకి వచ్చారు. అందరికీ కనిపించేలా మెడలో బంగారం ధరించి.. ఓ చేతిలో చిన్న కర్రను, మరో చేతిలో ప్లాస్టిక్ కవర్‌ను పట్టుకుని రోడ్లపై పూలు తెంపుతూ తిరగడం ప్రారంభించారు. ఈ క్రమంలో ఆమె ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో 60ఏళ్ల మహిళగా కనిపించే ఆమె ఎవరు అనే చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో ఆమె ఓ పోలీసు అధికారి అని తెలుసుకుని నెటిజన్లు షాకవుతున్నారు. చైన్ స్నాచర్‌ను పట్టుకోవడం కోసం అలా తయారైందని తెలసుకుని అవాక్కవుతున్నారు. ఇదిలా ఉంటే.. చైన్ స్నాచర్‌ను పట్టుకునేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. పోలీసుల తన కోసం గాలిస్తున్నారని గ్రహించాడో లేక మరోకారణమో తెలియదు కానీ ఆ స్నాచర్ మాత్రం సిటీలో అడుగుపెట్టలేదు. 


Updated Date - 2021-10-02T00:30:28+05:30 IST