పదిహేనేళ్ల ప్రేమ.. 8 ఏళ్ల కొడుకు.. ప్రియుడు మరో పెళ్లికి సిద్ధం కావడంతో ఆమె ఏం చేసిందంటే..

ABN , First Publish Date - 2022-03-07T05:45:54+05:30 IST

ఆమె తన పక్కింటి వ్యక్తితో పదిహేనేళ్ల క్రితం ప్రేమలో పడింది. పెళ్లి జరిగిన తర్వాత భర్తను కూడా వదిలేసి అతడి కోసం పుట్టింటికి వచ్చేసింది. పదిహేనేళ్లు అనధికారికంగా అతడి భార్యగా జీవించింది. వారికి ఎనిమిదేళ్ల కొడుకు కూడా ఉన్నాడు...

పదిహేనేళ్ల ప్రేమ.. 8 ఏళ్ల కొడుకు.. ప్రియుడు మరో పెళ్లికి సిద్ధం కావడంతో ఆమె ఏం చేసిందంటే..

ఆమె తన పక్కింటి వ్యక్తితో పదిహేనేళ్ల క్రితం ప్రేమలో పడింది. పెళ్లి జరిగిన తర్వాత భర్తను కూడా వదిలేసి అతడి కోసం పుట్టింటికి వచ్చేసింది. పదిహేనేళ్లు అనధికారికంగా అతడి భార్యగా జీవించింది. వారికి ఎనిమిదేళ్ల కొడుకు కూడా ఉన్నాడు. తాజాగా ఆమె ప్రియుడు మరో యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. 


వివరాల్లోకి వెళితే.. బీహార్‌లోని ముజఫరానగర్‌కు చెందిన యువతి 15 ఏళ్ల క్రితం తన పక్కింట్లో ఉండే అశోక్ అనే వ్యక్తితో ప్రేమలో పడింది. అయితే ఆమె తల్లిదండ్రులు ఆమెకు వేరే వ్యక్తితో వివాహం చేశారు. కానీ వివాహం తరువాత అశోక్ ఆమె అత్తారింటికి వెళ్లి తమ ప్రేమ వ్యవహారం గురించి చెప్పాడు. దీంతో ఆ యువతి భర్త ఆమెను వదిలేశాడు. ఆ తరువాత ఆ యువతి పుట్టింటికి వచ్చేసింది. మళ్లీ అశోక్‌తో అఫైర్ కొనసాగించింది. ఫలితంగా ఆమె ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ బాలుడికి ఇప్పుడు 8 సంవత్సరాలు. 


పదిహేనేళ్లుగా ఆమె అతడికి అనధికారికంగా భార్యగా కొనసాగుతోంది. ఈమె పేరు మీద అశోక్ పలు బ్యాంకుల నుంచి లోన్లు కూడా తీసుకున్నాడు. కాగా, గత నెలలో అశోక్ వీరిని వదిలేసి మరో యువతిని వివాహం చేసుకున్నాడు. దీంతో యువతి పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అశోక్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. 

Updated Date - 2022-03-07T05:45:54+05:30 IST