లక్షల జీతం వద్దు.. ఆన్‌లైన్‌ బేకరీ ముద్దు..!

ABN , First Publish Date - 2020-10-20T22:21:51+05:30 IST

కరోనా లాక్‌డౌన్‌ వల్ల ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయారు. లక్షల మంది నిరుద్యోగులు రోడ్డునపడ్డారు. వీరందరికీ లాక్‌డౌన్‌ ఓ చేదు జ్ఞాపకం. కానీ కొంత మందికి మాత్రం లాక్‌డౌన్‌ ఓ గొప్ప...

లక్షల జీతం వద్దు.. ఆన్‌లైన్‌ బేకరీ ముద్దు..!

కరోనా లాక్‌డౌన్‌ వల్ల ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయారు. లక్షల మంది నిరుద్యోగులు రోడ్డునపడ్డారు. వీరందరికీ లాక్‌డౌన్‌ ఓ చేదు జ్ఞాపకం. కానీ కొంత మందికి మాత్రం లాక్‌డౌన్‌ ఓ గొప్ప వరం. తమలోని టాలెంట్‌ను వెలికితీసేందుకు, దాని ద్వారా సొంతంగా వ్యాపారం మొదలు పెట్టేందుకు ఎంతగానో ఉపయోగపడింది. తమిళనాడుకు చెందిన స్టెఫీ కూడా కరోనా లాక్‌డౌన్‌లో తనలోని టాలెంట్‌ను బయటకు తీసింది. సొంతంగా ఓ చిన్న వ్యాపారం ప్రారంభించింది. దానికోసం లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని సైతం వదులుకుంది. 


స్టెఫీ ఎంబీఏ హెచ్‌ ఆర్‌లో పోస్ట్‌ గ్యాడ్యుయేషన్‌ పూర్తి చేసింది. లక్షల జీతం వచ్చే ఉద్యోగం సంపాదించింది. కానీ లాక్‌డౌన్‌తో ఉద్యోగం వాయిదా పడింది. ఇంట్లో ఖాళీగా ఉండడంతో ఏదో ఒకటి చేయాలనుకుంది. తనకు ఎంతో ఇష్టమైన బేకరీ ఫుడ్‌ ఐటమ్స్‌ తయారు చేయడం ప్రారంభించింది. ముఖ్యంగా కేకులు, కుకీస్‌ వంటి వంటకాలను తయారు చేయడం ప్రారంభించింది. వెరైటీ డిజైన్లతో అందంగా, రుచికరంగా కేక్‌లు తయారు చేస్తుండడంతో చుట్టుపక్కల వారికి కూడా అవి ఎంతగానో నచ్చాయి. తమ పిల్లల బర్త్‌డేలకు, ఇతర వేడులకు స్టెఫీతో కేక్‌లు తయారు చేయించుకునేవారు. దీంతో స్టెఫీకి కూడా తన టాలెంట్‌పై నమ్మకం పెరిగింది. బేకరీ ఐటమ్స్‌ విక్రయించేందుకు ఇన్‌స్టాగ్రాం పేజీని కూడా మొదలు పెట్టింది. 




బేకరీ బిజినెస్‌ చక్కగా సాగుతుండడంతో స్టెఫీ ఉద్యోగం కూడా వదులుకుంది. లాక్‌డౌన్‌ తరువాత ఉద్యోగంలో చేరాలని కాల్‌ లెటర్‌ వచ్చినా స్టెఫీ నో చెప్పేసింది. బేకరీ బిజినెస్‌నే కొనసాగించాలని నిర్ణయించుకుంది. అంతేకాకుండా ప్రస్తుతం కేకులు, బిస్కెట్లు తదితర బేకరీ ఐటమ్స్‌ తయారీపై ఆన్‌లైన్‌లో ట్రైనింగ్‌ క్లాసులను కూడా ప్రారంభించింది. కరోనా నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న మహిళలకు ఉచితంగా శిక్షణనిస్తూ వారు కూడా ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు సాయం చేస్తోంది.


బేకరీ బిజినెస్‌ గురించి స్టెఫీ మాట్లాడుతూ, తాను మొదట ఏదో హాబీగా ఈ బేకరీ ఐటమ్స్‌ తయారీని ప్రారంబించానని, కానీ ఇది ఇంతలా సక్సెస్‌ అవుతుందని, ఊహించలేదని, తాను తయారు చేసే కేక్‌లు, కూకీస్‌ మొదలైన తినుంబండారాల ధరలు అందుబాటులో ఉంటాయని, రుచి కూడా బాగుంటుదని, అందుకే డిమాండ్‌ పెరుగుతోందని స్టేఫీ చెబుతోంది. వ్యాపారం చక్కగా కొనసాగుతుండడంతో భవిష్యత్తులో కూడా ఈ వ్యాపారాన్నే కొనసాగిస్తానని స్టెఫీ చెబుతోంది. టాలెంట్‌ ఉంటే అవకాశాలే వెతుక్కంటూ వస్తాయంటే ఇదేనేమో మరి.


టాలెంట్‌ ఉంటే ఏదైనా సాధించవచ్చనే విషయాన్ని స్టెఫీ మరోసారి రుజువు చేసింది. అంతేకాదు తన టాలెంట్‌తో స్థానికంగా గొప్ప గుర్తింపు కూడా సంపాదిస్తోంది.

Updated Date - 2020-10-20T22:21:51+05:30 IST