Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

America లో ఆ రెస్టారెంట్ ముందు మహిళల ధర్నా.. ఓ తల్లికి ఎదురైన అవమానమే అసలు కారణం!

twitter-iconwatsapp-iconfb-icon
America లో ఆ రెస్టారెంట్ ముందు మహిళల ధర్నా.. ఓ తల్లికి ఎదురైన అవమానమే అసలు కారణం!

వాషింగ్టన్: చంటి బిడ్డ ఆకలితో ఏడుస్తుంటే ఏ తల్లి అయినా వెంటనే చేసే పని చనుపాలిచ్చి ఆ బిడ్డ ఆకలి తీర్చడమే. తాను ఎక్కడ ఉంది, ఏం చేస్తుంది అనే విషయాలను ఆ క్షణంలో ఆ తల్లికి గుర్తుకురావు. బిడ్డ ఏడుపు మాత్రమే ఆమెకు వినిపిస్తుంది. ఇదిగో ఇలాగే ఓ తల్లి రెస్టారెంట్‌లో ఉండగా తన బిడ్డకు పాలిచ్చింది. అదే ఆమె చేసిన నేరమైంది. అలా చేసినందుకు గాను రెస్టారెంట్ యజమాని ఆమెను అక్కడి నుంచి గెంటివేశాడు. ఈ అమానుష ఘటన అమెరికాలోని వాషింగ్టన్ నగరంలో చోటు చేసుకుంది. దీంతో కొందరు మహిళలు యజమాని చర్యను తప్పుబడుతూ రెస్టారెంట్ ముందు ధర్నాకు దిగారు. దీంతో ఇప్పుడీ ఘటన అక్కడ బాగా వైరల్ అవుతోంది. 

అసలేం జరిగిందంటే.. గత వారం రుబీ మీదేన్(25) అనే మహిళ తన భర్త అరోన్(31)తో కలిసి వాషింగ్టన్‌లోని అనకొర్టేస్ ప్రాంతంలో ఉన్న గ్రీక్ ఐల్యాండ్ అనే రెస్టారెంట్‌కు వెళ్లింది. ఆ సమయంలో ఈ దంపతులు తమ నాలుగు రోజుల బాబు, మరో పాపను కూడా తీసుకెళ్లారు. అయితే, అక్కడికి వెళ్లిన కొద్దిసేపటికే బాబు ఆకలితో ఏడవడం మొదలెట్టాడు. అది గ్రహించిన రుబీ కూర్చున్న చోటే బాబు పాలిచ్చింది. అంతే.. ఆమె అలా బాబుకు పాలు ఇవ్వడం గమనించిన రెస్టారెంట్ యజమాని వారిపట్ల అమానుషంగా ప్రవర్తించాడు. వెంటనే ఆ కుటుంబాన్ని రెస్టారెంట్ వదిలి వెళ్లిపోవాలని ఆదేశించాడు. దాంతో తాము చేసిన నేరం ఏంటని అడిగారు రుబీ దంపతులు. దానికి యజమాని మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని, వెంటనే ఇక్కడి నుంచి వెళ్లకపోతే మనుషులను పెట్టి బయటకు పంపాల్సి ఉంటుందని గాటుగా మాట్లాడాడు. దాంతో రుబీ దంపతులు అక్కడి నుంచి అవమాన భారంతో ఇంటికి వచ్చేశారు. 

America లో ఆ రెస్టారెంట్ ముందు మహిళల ధర్నా.. ఓ తల్లికి ఎదురైన అవమానమే అసలు కారణం!

అనంతరం ఆన్‌లైన్ వేదికగా గ్రీక్ ఐల్యాండ్ రెస్టారెంట్‌కు అరోన్ నెగెటివ్ రివ్యూవ్ ఇచ్చారు. అది చూసిన యజమాని 'మీ బేబీకి చనుపాలివ్వడానికి మరోసారి నా రెస్టారెంట్‌కు రావొద్దని' రిప్లై ఇచ్చాడు. అంతటితో ఆగకుండా రుబీని జంతువు అని, ఆమె పిల్లలను ఆకతాయిలని తిట్టాడు. దాంతో అరోన్ యజమాని చాట్‌ను స్క్రీన్‌షాట్ తీసి తన ఫేస్‌బుక్ పేజీలో పెట్టాడు. దీంతో ఈ ఘటన స్థానికంగా బాగా వైరల్ అయింది. కొందరు మహిళలు రెస్టారెంట్ ఎదుట ధర్నాకు దిగారు. యజమాని చేసింది ముమ్మాటికి తప్పేనని, దీనికి ఆయన సమాధానం చెప్పాలని పట్టుబడుతున్నారు. అలాగే రుబీకి వెంటనే క్షమాపణ చెప్పాలని కూడా మహిళలు డిమాండ్ చేస్తున్నారు.   

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

తాజా వార్తలుLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.