Woman journalist: మహిళా జర్నలిస్టుపై రైల్వే‌స్టేషన్ మాస్టర్ల లైంగిక వేధింపులు

ABN , First Publish Date - 2022-07-28T12:54:02+05:30 IST

రైల్వేస్టేషనులోని వెయిటింగ్‌రూమ్‌లో రైలు రాక కోసం ఎదురు చూస్తున్న మహిళా జర్నలిస్టును ఇద్దరు రైల్వే స్టేషన్‌మాస్టర్లు లైంగికంగా వేధించిన...

Woman journalist: మహిళా జర్నలిస్టుపై రైల్వే‌స్టేషన్ మాస్టర్ల లైంగిక వేధింపులు

చండీఘడ్ : రైల్వేస్టేషనులోని వెయిటింగ్‌రూమ్‌లో రైలు రాక కోసం ఎదురు చూస్తున్న మహిళా జర్నలిస్టును(Woman journalist) ఇద్దరు రైల్వే స్టేషన్‌మాస్టర్లు(station masters) లైంగికంగా వేధించిన ఘటన హర్యానా(Haryana)రాష్ట్రంలోని రేవారీలో జరిగింది. సోమవారం సాయంత్రం రేవారీ రైల్వే స్టేషన్‌లోని వెయిటింగ్ రూమ్‌లో రైలు రాక కోసం ఎదురు చూస్తుండగా తనను ఇద్దరు రైల్వే స్టేషన్‌మాస్టర్లు లైంగికంగా వేధించారని మహిళా జర్నలిస్టు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. రైలు ఎక్కేందుకు ఓ మహిళా జర్నలిస్టు రేవారీ స్టేషనుకు వచ్చింది. రైలు రావడానికి సమయం ఉండటంతో మహిళ వెయిటింగ్ రూమ్‌లోని టాయిలెట్‌కు వెళ్లి చూడగా, దాని తలుపు తాళం వేసి ఉండటాన్ని గుర్తించింది. 


ఆ తర్వాత స్టేషన్‌ మాస్టర్‌ కార్యాలయానికి వెళ్లింది. స్టేషన్ మాస్టర్లు వినయ్ శర్మ, రామోతర్‌లు టాయిలెట్ తాళం చెవి ఇవ్వడానికి నిరాకరించడమే కాకుండా తనను లైంగికంగా వేధించారని మహిళా జర్నలిస్టు ఫిర్యాదులో పేర్కొంది. లైంగికంగా వేధించిన ఇద్దరు స్టేషన్ మాస్టర్లపై ఐపీసీ (IPC) సెక్షన్లు 354 , 506, 509 కింద పోలీసులు కేసు నమోదు చేశామని గవర్నమెంట్ రైల్వే పోలీస్ (GRP) అధికారి తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు జీఆర్‌పీ పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌హెచ్‌ఓ భూపేంద్ర సింగ్‌ వివరించారు.


Updated Date - 2022-07-28T12:54:02+05:30 IST