చెట్టెక్కి మహిళ హల్‌చల్‌

ABN , First Publish Date - 2020-07-03T09:51:01+05:30 IST

అనారోగ్యంతో బాధపడుతున్న ఓ మహిళ చెట్టెక్కి హల్‌చల్‌ చేసింది. మలక్‌పేటలో నివసించే సుబ్రహ్మణ్యం కుమార్తె హారిక(33)

చెట్టెక్కి మహిళ హల్‌చల్‌

చాదర్‌ఘాట్‌, జూలై 2 (ఆంధ్రజ్యోతి): అనారోగ్యంతో బాధపడుతున్న ఓ మహిళ చెట్టెక్కి హల్‌చల్‌ చేసింది. మలక్‌పేటలో నివసించే సుబ్రహ్మణ్యం కుమార్తె  హారిక(33) అనారోగ్యంతో బాధపడుతోంది. గురువారం ఓ ఆస్పత్రి సమీపంలోగల చెట్టెక్కి కూర్చుంది. కిందకు దిగకపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న మలక్‌పేట ఎస్‌ఐ జ్యోతి ఆమెతో మాట్లాడి చెట్టుపై నుంచి దించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. 

Updated Date - 2020-07-03T09:51:01+05:30 IST