Advertisement
Advertisement
Abn logo
Advertisement

నడిరోడ్డుపై అర్ధనగ్నంగా మహిళ శవం.. సీసీటీవీ చెక్ చేస్తే షాకింగ్ సీన్ వెలుగులోకి..

ఇంటర్నెట్ డెస్క్: ఒక గుర్తు తెలియని మహిళ మృతదేహం నడిరోడ్డుపై ఉండటం కలకలం రేపింది. ఈ ఘటన తమిళనాడులోని చిన్నియంపళాయంలోని అవినాషి రోడ్డుకు సమీపంలో వెలుగు చూసింది. అర్ధనగ్నంగా ఉన్న ఈ యువతి మృతదేహాన్ని కొన్ని వాహనాలు తొక్కేసుకుంటూ వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన తర్వాత హుటాహుటిన ఘటనా స్థలానికి చేరిన పోలీసులు.. రోడ్డుపై ఉన్న మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. క్రిమినల్ పీనల్ కోడ్ సెక్షన్ 174 (అనుమానాస్పద మృతి) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతురాలి ఆనవాలు గుర్తించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. అటుగా వెళ్తున్న కొందరు వాహనదారులు ఈ మృతదేహం గురించి పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు సమాచారం.


దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు షాకింగ్ దృశ్యాలు కనిపించాయి. దగ్గరలో ఉన్న ఒక కమర్షియల్ బిల్డింగ్‌ వద్ద సీసీకెమెరా సదుపాయం ఉంది. ఆ కెమెరాను పరిశీలించిన పోలీసులకు.. ఒక ఎస్‌యూవీలో నుంచి సదరు మహిళ మృతదేహాన్ని బయటకు విసిరేయడం కనిపించింది. ఆ తర్వాత అటుగా వచ్చిన రెండు వాహనాలు ఆ మృతదేహాన్ని తొక్కుకుంటూ వెళ్లిపోయాయి. సదరు మహిళను ఎస్‌యూవీ ఢీకొట్టి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. అదే సమయంలో ఆమె మృతదేహం అర్ధనగ్నంగా ఉండటంతో హత్య చేసి ఉంటారా? అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కేసులో దర్యాప్తు కొనసాగుతున్నట్లు వారు వెల్లడించారు.

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement