అత్యాచారం చేయడానికి యత్నించిన వ్యక్తికి జీవితంలో గుర్తుండి పోయేలా షాకిచ్చిన ఓ యువతి

ABN , First Publish Date - 2021-10-03T12:36:34+05:30 IST

మధ్యప్రదేశ్‌లోని ఒక గ్రామంలో ఓ వ్యక్తి ఒక మహిళ ఇంట్లో చొరబడి ఆమెపై అత్యాచారం చేయబోయాడు. అమె అతనికి లొంగకపోవండో ఆమెను చితకబాదాడు, అప్పుడు ఆమె ఊహించిన విధంగా అతడిని శిక్షించింది...

అత్యాచారం చేయడానికి యత్నించిన వ్యక్తికి జీవితంలో గుర్తుండి పోయేలా షాకిచ్చిన ఓ యువతి

మధ్యప్రదేశ్‌లోని ఒక గ్రామంలో ఓ వ్యక్తి ఒక మహిళ ఇంట్లో చొరబడి ఆమెపై అత్యాచారం చేయబోయాడు. అమె అతనికి లొంగకపోవండో ఆమెను చితకబాదాడు, అప్పుడు ఆమె ఊహించిన విధంగా అతడిని శిక్షించింది. 


పోలీసుల కథనం ప్రకారం.. గత గురువారం రాత్రి 11 గంటల సమయంలో గ్రామంలో అందరూ నిద్రపోతున్న వేళ రమేశ్ సాకేత్(45) అనే వ్యక్తి ఒక మహిళ ఇంట్లో చొరబడ్డాడు. ఆ సమయంలో ఆమె ఇంట్లో ఒంటరిగా ఉండడంతో ఆమెపై అత్యాచారం చేయబోయాడు. దానికి ఆమె ప్రతిఘటించడంతో ఆమెను చితకబాదాడు. అతడిని ఎదొర్కొనేందుకు ఆమె మంచం కింద దాచి ఉన్న గడ్డి కోసే కత్తిని తీసుకొంది. దాంతో అతడి పురుషాంగాన్ని కోసేసింది. దీని తరువాత ఆమె స్వయంగా పోలీస్ స్టేషన్ వచ్చి జరిగిన ఘటన గురించి చెప్పింది. 


పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని రక్తపు మడుగులో పడిఉన్న నిందితుడిని వెంటనే ఆస్పత్రికి తరలిచ్చింది. అతను ఇప్పుడు చికిత్స పొందుతూ ఉన్నాడు. పోలీసులు అతనిపై అత్యాచార యత్నం చేసినందుకు కేసు నమోదు చేశారు. నిందితుడిపై దాడి చేసినందుకు ఆ మహిళపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-10-03T12:36:34+05:30 IST