కిడ్నాపైన భర్తను వెతుక్కుంటూ కూతుళ్లతో అడవిలోకి..

ABN , First Publish Date - 2022-02-16T22:42:39+05:30 IST

మధ్యప్రదేశ్‌కు చెందిన అశోక్ పవార్ ప్రైవేట్ కంపెనీలో ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. ఇంద్రావతి నదిపై వంతెన నిర్మించేందుకు బిజాపూర్ వచ్చాడు. కాగా, కొద్ది రోజుల క్రితం అశోక్ పవార్‌తో పాటు అతడితో పని చేస్తున్న ఆనంద్..

కిడ్నాపైన భర్తను వెతుక్కుంటూ కూతుళ్లతో అడవిలోకి..

రాయ్‌పూర్: అశోక్ పవార్ అనే ఇంజనీర్‌ను మావోయిస్ట్‌లు కిడ్నాప్ చేశారు. అతడి భార్య సొనాలి పవార్.. పోలీసులను ఆశ్రయించింది. సోషల్ మీడియా ద్వారా వేడుకుంది. అయినప్పటికీ మావోల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో తన భర్తను తానే వెతుక్కుంటానని తన మైనర్ కూతుళ్లతో అబుజ్‌మడ్ అడవి బాట పట్టింది. ఛత్తీస్‌గఢ్‌లోని బిజాపూర్ జిల్లాలో తాజాగా వెలుగు చూసిందీ సంఘటన. అయితే అశోక్ పవార్‌ను మంగళవారం మావోలు విడుదల చేశారు. కానీ, సోనాలి మాత్రం అడవిలోనే చిక్కుకుపోయినట్లు స్థానిక పోలీసులు తెలిపారు.


మధ్యప్రదేశ్‌కు చెందిన అశోక్ పవార్ ప్రైవేట్ కంపెనీలో ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. ఇంద్రావతి నదిపై వంతెన నిర్మించేందుకు బిజాపూర్ వచ్చాడు. కాగా, కొద్ది రోజుల క్రితం అశోక్ పవార్‌తో పాటు అతడితో పని చేస్తున్న ఆనంద్ యాదవ్ అనే వ్యక్తిని మావోయిస్ట్‌లు కిడ్నాప్ చేశారు. అశోక్ భార్య సొనాలి పోలీసులను సంప్రదించింది. సోషల్ మీడియాలో ఎమోషనల్ వీడియో విడుదల చేసింది. ఈ వీడియో వైరల్ కావడంతో మావోలు అశోక్‌ను వదిలేశారని స్థానికులు అంటున్నారు. అయితే అంతలోపే తన భర్తను వెతుక్కుంటూ సొనాలి అడవిలోకి వెళ్లింది.


‘‘సొనాలి కొంత మంది స్థానికులు, జర్నలిస్ట్‌ల సహాయంతో అడవిలోకి వెళ్లింది. ఆమెతో తన ఇద్దరు మైనర్ కూతుళ్లు ఉన్నారు. ఒకరి వయసు ఐదేళ్లు కాగా, మరొకరి వయసు రెండున్నరేళ్లు ఉంటుంది. వంతెన నిర్మాణం గురించి తెలుసుకుందామని సొనాలిని కలిశాను. ఆ మరునాడే అశోక్ పవార్‌ను కిడ్నాప్ చేశారు’’ అని ఒక జర్నలిస్ట్ తెలిపారు. సొనాలి ప్రస్తుతం బెడ్రే పోలీస్ స్టేషన్ పరిధిలో ఉందని, ఆమె భర్త అశోక్ కుట్రు పోలీస్ స్టేషన్‌లో ఉన్నట్లు ఆ జర్నలిస్ట్ పేర్కొన్నారు.

Updated Date - 2022-02-16T22:42:39+05:30 IST