కాబోయే బాయ్‌ఫ్రెండ్‌ను పరీక్షించేందుకు యువతి చేసిన పనితో..

ABN , First Publish Date - 2020-10-23T03:22:36+05:30 IST

ఇద్దరు వ్యక్తులు ఒకరికొకరు కలుసుకోకుండా చేసుకునే ఈ బ్లైండ్ డేటింగ్‌లో సహజంగానే నమ్మకం, భద్రత వంటి విషయాలు మెదడును తొలిచేస్తూ ఉంటాయి.

కాబోయే బాయ్‌ఫ్రెండ్‌ను పరీక్షించేందుకు యువతి చేసిన పనితో..

బీజింగ్: బ్లైండ్ డేట్.. రొమాంటిక్ రిలేషన్‌షిప్‌ను పెంచుకునేందుకు గతంలో పరిచయం లేని వ్యక్తితో చేసుకునే సామాజికపరమైన ఒప్పందం. అయితే, ఇందులో ఓ చిక్కు ఉంది. ఇద్దరు వ్యక్తులు ఒకరికొకరు కలుసుకోకుండా చేసుకునే ఈ బ్లైండ్ డేటింగ్‌లో సహజంగానే నమ్మకం, భద్రత వంటి విషయాలు మెదడును తొలిచేస్తూ ఉంటాయి. అయితే, అవతలి వ్యక్తి స్వభావం, వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఇది చక్కని వేదిక అన్న భావన కూడా ఉంది.


ఒకరి ప్రవర్తన, వైఖరిని అర్థం చేసుకోవడానికి డేటింగ్ ఒక్కటే సరిపోదు. అయితే, తన పార్ట్‌నర్ ఎంత ఉదారవాదో తెలుసుకునేందుకు మాత్రం ఇది చక్కగా ఉపయోగపడుతుంది. రెస్టారెంట్ బిల్లు చెల్లించడమో, లేదంటే డేట్‌కు సంబంధించి మొత్తం ఖర్చులు భరించడమో చేస్తే ఆ భాగస్వామి ఉదారవాదుడి కిందే లెక్క. అయితే ఒక్క డేట్‌తో అవతలి వ్యక్తిపై ఓ అంచనాకు వచ్చేయొచ్చా? అంటే ఎంతమాత్రమూ కాదు. 


చైనాకు చెందిన ఓ యువతి తన కాబోయే బాయ్‌ఫ్రెండ్ ఎంత ఉదారవాదుడో తెలుసుకునేందుకు ఓ చక్కని మార్గాన్ని ఎంచుకుంది. ఏకంగా తన 23 మంది కుటుంబ సభ్యులను కూడా తనతోపాటు హోటల్‌కు తీసుకెళ్లింది. వారి బిల్లులను కూడా అతడు చెల్లిస్తాడో, లేక బిల్లు చూసి జడుసుకుంటాడోనని తెలుసుకోవాలనుకుంది. చివరికి డేట్ ముగిసే సరికి మొత్తం బిల్లు 20 వేల యన్‌లు (2,284 పౌండ్లు) అయింది. అంత బిల్లు చూసే సరికి బాయ్‌ఫ్రెండ్ హోటల్ నుంచి జారుకున్నాడు.


అతడిని 29 ఏళ్ల ఝియావో లియుగా గుర్తించారు. ఫుడ్, డ్రింక్స్‌కు అంత బిల్లెలా వచ్చిందో అర్థంకాక బుర్ర బద్దలుగొట్టుకున్నాడు. అయితే, ఆ తర్వాత యువతి, లియు మధ్య డేటింగ్‌కు అంగీకారం కుదిరింది. మొత్తం బిల్లును యువతి, ఆమె కుటుంబ సభ్యులు చెల్లించడంతో వారి బ్లైండ్ డేటింగ్ కథ సుఖాంతమైంది. 

Updated Date - 2020-10-23T03:22:36+05:30 IST