స్కూలుకెళుతున్న చిన్నపిల్లాడికి రహస్యంగా ఒక ఉత్తరం ఇచ్చిన తల్లి.. ఆ ఉత్తరం చదివిన వెంటనే పోలీసులకు కాల్ చేసిన స్కూల్‌టీచర్.. అసలేం జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-03-02T05:40:55+05:30 IST

స్కూలుకెళుతున్న తన ఏడేళ్ల కొడుకు చేతితో ఆ మహిళ ఒక ఉత్తరం ఇచ్చింది. దాన్ని రహస్యంగా స్కూల్ టీచర్‌కి ఇవ్వాలని సూచించింది. స్కూల్‌లో పిల్లాడు తెచ్చిన లెటర్ చదివి.. ఆ టీచర్‌కు చెమటలు పట్టాయి. వెంటనే ఆ టీచర్ పోలీసులకు కాల్ చేసి...

స్కూలుకెళుతున్న చిన్నపిల్లాడికి రహస్యంగా ఒక ఉత్తరం ఇచ్చిన తల్లి.. ఆ ఉత్తరం చదివిన వెంటనే పోలీసులకు కాల్ చేసిన స్కూల్‌టీచర్.. అసలేం జరిగిందంటే..

స్కూలుకెళుతున్న తన ఏడేళ్ల కొడుకు చేతితో ఆ మహిళ ఒక ఉత్తరం ఇచ్చింది. దాన్ని రహస్యంగా స్కూల్ టీచర్‌కి ఇవ్వాలని సూచించింది. స్కూల్‌లో పిల్లాడు తెచ్చిన లెటర్ చదివి.. ఆ టీచర్‌కు చెమటలు పట్టాయి. వెంటనే ఆ టీచర్ పోలీసులకు కాల్ చేసి ఆ లెటర్ వారికి అందించింది. పోలీసులు లెటర్ పంపించిన మహిళ ఇంటికి వెళ్లి తనిఖీ చేయగా.. అక్కడ కారు గ్యేరేజ్‌లో ఒక చిన్న ఫ్రీజర్‌ ఉంది. అది తెరిచి చూస్తే.. అందులో మంచుతో గడ్డకట్టిన మూడేళ్ల బాబు శవం దొరికింది.


వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని లాస్ వెగాస్ నగరంలో జీవించే మిచేల్ అనే మహిళ గత రెండేళ్లుగా భర్తను వదిలేసి తన ప్రియుడు ఆంటోనీతో ఉంటోంది. ఆంటోని తన ఇల్లు వదిలి మిచేల్ ఇంట్లో.. ఆమె ఇద్దరు పిల్లలు మార్టిన్(7), జెఫ్రీ(3)తో ఉంటున్నాడు. ఈ క్రమంలో 2021 డిసెంబర్ 11న ఇంట్లో ఆడుకుంటున్న చిన్నారి జెఫ్రీ ఒక్కసారిగా మాయమయ్యాడు. ఆ రోజు మిచేల్ తన ప్రియుడు ఆంటోనితో కలిసి ఇంటి చుట్టుపక్కలంతా వెతికింది. కానీ ఇంట్లో ఉన్న గ్యారేజ్‌లో మాత్రం వెతకలేదు. ఆక్కడికి వెళ్లకూడదని ఆంటోని ఆమెను హెచ్చరించాడు.


ఆ తరువాత నుంచి ఇద్దరి మధ్య గొడవలు జరగడం మొదలయ్యాయి. దీంతో మిచేల్‌ను ఆంటోని ఇంట్లో నుంచి బయటకి వెళ్లకుండా ఒక గదిలో బంధించాడు. ఆంటోని ప్రవర్తనతో మిచేల్‌కు జెఫ్రీ అదృశ్యం విషయంలో అనుమానం కలిగింది. మిచేల్ ఒకసారి ఇంటి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా.. ఆంటోని ఆమెను పట్టుకొని చితకబాదాడు. మరోసారి అలా చేస్తే.. మార్టిన్(మిచేల్ పెద్ద కుమారుడిని) చంపేస్తానని బెదిరించాడు.


ఇలాంటి పరిస్థితుల్లో మిచేల్ సహాయం కోరుతూ ఒక ఉత్తరం రాసింది. ఆ ఉత్తరం మార్టిన్‌కు రహస్యంగా ఇచ్చి.. అతని స్కూల్ టీచర్‌కు అందించాలని చెప్పింది. మార్టిన్ ఆ ఉత్తరాన్ని స్కూల్ టీచర్‌కు అందించగా.. టీచర్ ఆ లెటర్ చదివి పోలీసులకు సమాచారం చేరవేసింది. పోలీసులు వెంటనే మిచేల్ ఇంటికి వెళ్లి ఆంటోనితో మాట్లాడారు. కానీ ఆంటోని పోలీసులు అడిగిన ప్రశ్నలకు సరిగా సమాధానం చెప్పలేదు. అంతలో మిచేల్ తన బాయ్ ఫ్రెండ్ ఆంటోని తనకు చిత్రహింసలు పెడుతున్నాడని.. తన చిన్న కొడుకు జెఫ్రీ రెండు నెలలుగా కనబడడం లేదని పోలీసులకు చెప్పింది. 


జెఫ్రీ మిస్సింగ్ కేసులో ఆంటోనిపై అనుమానం ఉందని మిచేల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు సెర్చ్ వారంట్ తీసుకొని మిచేల్ ఇంట్లో తనిఖీ చేశారు. ఇంట్లో ఉన్న కారు గ్యారేజ్‌లో ఒక చిన్న ఫ్రీజర్ ఉంది. అది తెరచి చూడగా.. పోలీసులకు చిన్నారి జెఫ్రీ శవం కనిపించింది. జెఫ్రీ మృతదేహం ఫ్రీజర్‌లో మంచుతో గడ్డ కట్టుకుపోయింది. 


మిచేల్, మార్టిన్‌లను ఇంట్లో కిడ్నాప్ చేసినందుకు పోలీసులు ఆంటోనిపై కేసు పెట్టారు. జెఫ్రీ హత్యకేసులో ఆంటోనీపై ఇంకా విచారణ సాగుతోంది.


Updated Date - 2022-03-02T05:40:55+05:30 IST