భర్త మరణించిన 14 నెలలకు బిడ్డకు జన్మనిచ్చిన మహిళ.. అదెలా సాధ్యమైందంటే..

ABN , First Publish Date - 2021-07-22T16:55:07+05:30 IST

ఆమె వయసు 41 సంవత్సరాలు.. ఆమె భర్త చనిపోయి 14 నెలలు..

భర్త మరణించిన 14 నెలలకు బిడ్డకు జన్మనిచ్చిన మహిళ.. అదెలా సాధ్యమైందంటే..

ఆమె వయసు 41 సంవత్సరాలు.. ఆమె భర్త చనిపోయి 14 నెలలు.. తాజాగా ఆమె ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.. ఇదెలా సాధ్యం అని ఆశ్చర్యపోతున్నారా? ఎంబ్రియో ఫెర్టిలైజేషన్ (అండాలను ఫలదీకరించి భద్రపరచడం) ద్వారా ఆమె ఓ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. భర్త కోరిక మేరకు ఆ మహిళ ఇలా తల్లి అయింది. 


అమెరికాలోని ఓక్లహామాకు చెందిన సారా షెలెన్‌బర్గ్ భర్త స్కాట్ గతేడాది ఫిబ్రవరిలో గుండెపోటుతో మరణించాడు. అంతకు ముందే ఒకసారి అతనికి గుండెపోటు రావడంతో కృతిమ పద్ధతిలో తల్లిదండ్రులు కావాలని వారు అప్పుడే నిర్ణయించుకున్నారు. ఇద్దరూ ఓ ఫెర్టిలిటీ క్లినిక్‌ను ఆశ్రయించి పిండాలను భద్రపరిచారు. భర్త మరణించిన ఆరు నెలల అనంతరం సారా ఆ క్లినిక్‌కు వెళ్లి ప్రక్రియను పూర్తి చేసింది. గత నెలలో ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఇదే పద్ధతిలో మరో పిండాన్ని కూడా భద్రపరిచామని, వచ్చే ఏడాది చివర్లో మరో బిడ్డను కంటానని సారా తెలిపింది.  

Updated Date - 2021-07-22T16:55:07+05:30 IST