ఏకే 47... వరుడికి మహిళ ‘గిఫ్ట్’

ABN , First Publish Date - 2020-12-01T01:05:55+05:30 IST

పెళ్లిళ్ళ సందర్భాల్లో ఎటువంటి కానుకలనిస్తారో మనకు తెలిసిన విషయమే. వీటిలో... ఖరీదైనవి, సాధారణమైనవి, వింతగొలిపేవి... ఇలా రకరకాలుగా ఉంటాయన్నది కూడా తెలిసిన విషయమే. కొందరైతే... చిలిపిగా కండోమ్‌లు కూడా కానుకగా ఇస్తుంటారని వింటూంటాం.

ఏకే 47... వరుడికి మహిళ ‘గిఫ్ట్’

ఇస్లామాబాద్ : పెళ్లిళ్ళ సందర్భాల్లో ఎటువంటి కానుకలనిస్తారో మనకు తెలిసిన విషయమే. వీటిలో... ఖరీదైనవి, సాధారణమైనవి, వింతగొలిపేవి... ఇలా రకరకాలుగా ఉంటాయన్నది కూడా తెలిసిన విషయమే. కొందరైతే... చిలిపిగా కండోమ్‌లు కూడా కానుకగా ఇస్తుంటారని వింటూంటాం. అయితే... పాకిస్తాన్ లో జరిగిన ఓ పెళ్ళిలో మాత్రం మరీ విచిత్రమైన ‘కానుక’ చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. 


ఆ పెళ్లిలో ఓ మహిళ... వరుడికి ఏకంగా ఏకే 47 రైఫిల్‌ నే ‘కానుక’గా ఇచ్చి అందరినీ  ఆశ్చర్యపరిచింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పాకీస్థాన్‌లో జరిగిన ఈ ఘటనను భారతీయ నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. ‘ఇండియాలో పువ్వులిస్తాం... పాకిస్థానీలు గన్‌లు ఇస్తారు’ అంటూ ఈ సందర్భంగా తెగ కామెంట్లు చేస్తున్నారు.


కాగా... దీనిపై కొందరు పాకిస్థానీయులు కూసింత ఘాటుగానే స్పందిస్తున్నారు. ‘అది మా సాంప్రదాయం కాదు’. అని చెబుతున్నారు. ఏదేమైనా ‘పెళ్లికి ఏకే 47’ వంటి ఆయుధాన్ని కానుకగా ఇవ్వడం ఆశ్చర్యమే కదా. అయితే, వధువుకు మాత్రం ఆ గిఫ్టును స్వీకరించడం ఏమాత్రం ఇష్టం లేనట్లు కనిపించింది. ఇక ఈ విషయాన్ని పక్కన పెడితే... అసలా మహిళ ఏకే 47 ను ఎలా తెచ్చిందన్న దానిపై ఇప్పుడు సర్వత్రా చర్చోపచర్చలు నడుస్తున్నాయి. 

Updated Date - 2020-12-01T01:05:55+05:30 IST