రైల్లో ప్రయాణిస్తున్న నిండు గర్భిణి.. సడన్‌గా ప్రారంభమైన నొప్పులు.. కుటుంబ సభ్యుల్లో టెన్షన్.. చివరకు..

ABN , First Publish Date - 2021-08-05T16:39:21+05:30 IST

ఆమె డెలివరీ కోసం పుట్టింటికి వెళ్తోంది.. రైలు ప్రయాణంలోనే ఆమెకు నొప్పులు ప్రారంభమయ్యాయి..

రైల్లో ప్రయాణిస్తున్న నిండు గర్భిణి.. సడన్‌గా ప్రారంభమైన నొప్పులు.. కుటుంబ సభ్యుల్లో టెన్షన్.. చివరకు..

ఆమె డెలివరీ కోసం పుట్టింటికి వెళ్తోంది.. రైలు ప్రయాణంలోనే ఆమెకు నొప్పులు ప్రారంభమయ్యాయి.. ఆ విషయం తెలుసుకున్న టీటీఈ ట్రైన్ చేరుకోబోయే స్టేషన్ అధికారులకు సమాచారం అందించారు.. రైల్వే అధికారులు వైద్యుడితో పాటు అంబులెన్స్‌నూ సిద్ధంగా ఉంచారు.. అయితే అక్కడకు చేరుకోకముందే ఆ మహిళకు రైల్లోనే ప్రసవం అయిపోయింది.. బోగీలో ఉన్న ఇతర మహిళల సహకారంతో ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.. బాంద్రా టెర్మినల్ ఎక్స్‌ప్రెస్‌లో బుధవారం ఈ ఘటన జరిగింది. 


కుందల్‌కు చెందిన వికాస్ శర్మ భార్య అయిన పూజ డెలివరీ కోసం హిసార్ వెళ్లేందుకు మంగళవారం తన సోదరుడితో కలిసి బాంద్రా టెర్మినల్ ఎక్స్‌ప్రెస్ ఎక్కింది. రైలు రతన్‌గఢ్ స్టేషన్ చేరుకునే సమయానికి పూజకు నొప్పులు ప్రారంభమయ్యాయి. ఆమె సోదరుడు వెంటనే టీటీఈకి సమాచారం అందించాడు. టీటీఈ వెంటనే స్పందించి రతన్‌గఢ్ రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చారు. వైద్యుడిని, అంబులెన్స్‌ను స్టేషన్‌లో సిద్ధంగా ఉంచాల్సిందిగా కోరారు. అయితే రైలు రతన్‌గఢ్ చేరుకునే లోపే ఆమెకు ప్రసవం జరిగిపోయింది. 


బోగీలోని ఇతర మహిళలు ఆమెకు పురుడు పోశారు. వారి సహకారంతో పూజ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. రైలు రతన్‌గఢ్ చేరుకోగానే అక్కడ సిద్ధంగా ఉన్న డాక్టర్ పూజను, చిన్నారినీ పరీక్షించారు. అత్యవసర వైద్య చికిత్స అందించారు. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని తెలిపారు. 

Updated Date - 2021-08-05T16:39:21+05:30 IST