పొరపాటున వేరే ట్రైన్ ఎక్కిన మహిళ.. ఆలస్యంగా గ్రహించి దిగేందుకు యత్నం.. ఇంతలోనే రైలు స్పీడ్ పెరగడంతో..

ABN , First Publish Date - 2022-01-02T22:20:51+05:30 IST

ఆమెకు సుమారు 35ఏళ్ల వయసు ఉంటుంది. మంగళూరు వెళ్లేందుకు బయల్దేరింది. తొందరలో ఒక ట్రైన్‌కు బదులు మరో ట్రైన్ ఎక్కేసింది. ఆలస్యంగా ఆ విషయాన్ని గుర్తించిన ఆమె.. ట్రైన్ దిగేందకు ప్రయత్నించిం

పొరపాటున వేరే ట్రైన్ ఎక్కిన మహిళ.. ఆలస్యంగా గ్రహించి దిగేందుకు యత్నం.. ఇంతలోనే రైలు స్పీడ్ పెరగడంతో..

ఇంటర్నెట్ డెస్క్: ఆమెకు సుమారు 35ఏళ్ల వయసు ఉంటుంది. మంగళూరు వెళ్లేందుకు బయల్దేరింది. తొందరలో ఒక ట్రైన్‌కు బదులు మరో ట్రైన్ ఎక్కేసింది. ఆలస్యంగా ఆ విషయాన్ని గుర్తించిన ఆమె.. ట్రైన్ దిగేందకు ప్రయత్నించింది. అయితే అప్పటికే రైలు స్పీడు పెరగడంతో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఇంతకూ ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే..



మంగళూరుకు చెందిన రాణి అనే మహిళ కొద్ది రోజుల క్రితం ఓ పని మీద మధ్యప్రదేశ్‌కు వచ్చింది. అనంతరం డిసెంబర్ 31న రాత్రి 3గంటలకు తిరుగు పయనమైంది. ఈ క్రమంలోనే ఖాండ్వాలో రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. అప్పటికే మంగ్లా ఎక్స్‌ప్రెస్ (12617) ప్రయాణానికి సిద్ధంగా ఉండటంతో.. గబగబా వెళ్లి ఆ ట్రైన్ ఎక్కేసింది. తీరా ఆ ట్రైన్‌లో ఆమెకు తన బెర్త్ నెంబర్ దొరక్కపోవడంతో.. తాను వేరే ట్రైన్ ఎక్కినట్టు గ్రహిచింది. ఈ క్రమంలోనే కిందకు దిగేందకు ప్రయత్నించింది. అయితే అప్పటికే ఆ ట్రైన్.. స్పీడ్ పెరిగింది. దీంతో ఆమె ట్రైన్‌కు ప్లాట్‌ఫాంకు మధ్య వేలాడవలసి వచ్చింది. ట్రైన్ ఆమెను ప్లాట్‌ఫాంపై ఈడ్చుకుపోవడాన్ని గమనించిన రైల్వే పోలీసులు.. పరుగెత్తుకెళ్లి రక్షించారు. ప్రథమ చికిత్స అనంతరం ఆమెను తాను వెళ్లాల్సిన మంగళూరు ఎక్స్‌ప్రెస్ (12618) ట్రైన్‌ను ఎక్కించారు. కాగా.. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 




Updated Date - 2022-01-02T22:20:51+05:30 IST