Woman Gave Birth to 5 Children: పెళ్లయిన ఏడేళ్ల తర్వాత ఒకే కాన్పులో ఐదుగురు పిల్లలకు ఆమె జన్మనిచ్చింది కానీ..

ABN , First Publish Date - 2022-07-26T20:23:37+05:30 IST

ఒకే కాన్పులో కవల పిల్లలు జన్మించడం సాధారణ విషయమే. ఇటీవల ఓ మహిళ ఒకే కాన్పులో నలుగురు పిల్లలకు జన్మనిచ్చి వార్తల్లో నిలిచింది.

Woman Gave Birth to 5 Children: పెళ్లయిన ఏడేళ్ల తర్వాత ఒకే కాన్పులో ఐదుగురు పిల్లలకు ఆమె జన్మనిచ్చింది కానీ..

ఒకే కాన్పులో కవల పిల్లలు జన్మించడం సాధారణ విషయమే. ఇటీవల ఓ మహిళ ఒకే కాన్పులో నలుగురు పిల్లలకు జన్మనిచ్చి వార్తల్లో నిలిచింది. రాజస్థాన్‌(Rajasthan) లోని కరౌలీ జిల్లాకు చెందిన ఓ మహిళ సోమవారం ఒకే కాన్పులో ఐదుగురు శిశువులకు జన్మనిచ్చింది. అయితే ఆ దంపతులకు ఈ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. పుట్టిన శిశువుల్లో నలుగురు వెంటనే ప్రాణాలు కోల్పోయారు. మరొక శిశువు హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మరణించింది.  


ఇది కూడా చదవండి..

ఉబ్బుతున్న పొట్ట.. కడుపు నొప్పంటూ కూతురు రెండ్రోజులుగా బాధపడుతోంటే ఆస్పత్రికి తీసుకెళ్లిన తల్లి.. డాక్టర్లు చెప్పింది విని..


కరౌలీకి చెందిన అష్రఫ్ అలీ భార్య రేష్మ పురుటి నొప్పులతో బాధపడుతూ స్థానిక ఆస్పత్రిలో చేరింది. సిజేరియన్ కాకుండా సాధారణ ప్రసవం ద్వారానే ఆ మహిళ ఐదుగురికి జన్మనిచ్చినట్లు డాక్టర్ వెల్లడించారు. ఇద్దరు మగపిల్లలు, ముగ్గురు బాలికలు జన్మించినట్లు చెప్పారు. వివాహం జరిగిన చాలా ఏళ్ల వరకు ఆమెకు పిల్లలు లేరు. ఆస్పత్రుల చుట్టూ తిరిగి మందులు వాడిన తర్వాత ఆమె గర్భవతి అయింది. పెళ్లైన ఏడేళ్ల తర్వాత మహిళకు సంతానం కలిగింది. అయితే వారెవరూ ప్రాణాలతో లేకపోవడం విషాదంగా మారింది. 


నెలలు నిండకుండా ఏడో నెలలోనే ప్రసవం (pre-mature delivery) కావడం వల్లే శిశువులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. చిన్నారులకు మెరుగైన చికిత్స అవసరం అని భావించి జైపూర్‌లోని మరో ఆస్పత్రికి సిఫార్సు చేశారు. అక్కడకు వెళ్లే లోపే నలుగురు చనిపోయారు. మరో శిశువు చికిత్స పొందుతూ మరణించింది. తల్లి ఆరోగ్యం మాత్రం సురక్షితంగానే ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. 

Updated Date - 2022-07-26T20:23:37+05:30 IST