అచ్చం రవితేజ సినిమాలోలాగా.. ఈ యువతికి తెలియకుండానే ఆమె అపార్ట్మెంట్‌లోనే సీక్రెట్‌గా ఓ వ్యక్తి.. చివరకు..

ABN , First Publish Date - 2022-06-15T21:27:44+05:30 IST

మీరు రవితేజ హీరోగా నటించిన `ఔను.. వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు` సినిమా చూశారా?

అచ్చం రవితేజ సినిమాలోలాగా.. ఈ యువతికి తెలియకుండానే ఆమె అపార్ట్మెంట్‌లోనే సీక్రెట్‌గా ఓ వ్యక్తి.. చివరకు..

మీరు రవితేజ హీరోగా నటించిన `ఔను.. వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు` సినిమా చూశారా? ఆ సినిమాలో హీరోయిన్‌కు తెలియకుండా ఆమె ఇంట్లోనే హీరో ఉంటాడు. అచ్చం అలాగే ఒక వ్యక్తి.. డెకెరా అనే యువతి అపార్ట్‌మెంట్‌లో ఆమెకు తెలియకుండానే నివసించాడు. తనకు ఎదురైన అనుభవాన్ని డెకెరా సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. డెకెరా అనే యువతి తన స్నేహితురాళ్లతో కలిసి ఓ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తోంది. బయటకు వెళ్లినపుడు ఎవరూ ఆ అపార్ట్‌మెంట్‌కు తాళాలు వేయరు. 


ఇది కూడా చదవండి..

అందరూ చూస్తుండగానే చెప్పులతో ఓ యువకుడిని చితకబాదిన యువతి.. నడిరోడ్డుపై అతడు చేసిన నిర్వాకానికి..


ఒకరు బయటకు వెళ్లినపుడు మరొకరు లోపలే ఉంటారు కాబట్టి వారికి లాక్ చేసే అలవాటు లేదు. కాగా, కొద్ది రోజుల కిందట స్నేహితురాళ్లు రూమ్ ఖాళీ చేసి వెళ్లిపోవడంతో డెకెరా మాత్రమే అక్కడ ఉంటోంది. అయినా ఫ్లాట్‌ను లాక్ చేయడం లేదు. ఇటీవల తన ఫ్లాట్‌లోని ఇతర గదులను లాక్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా.. ఒక రూమ్ నుంచి గురక శబ్దం వినిపించింది. తన ఇంట్లో ఎవరో ఉన్నారని డెకెరా గ్రహించింది. భయపడిన ఆమె దగ్గర్లోనే ఉన్న స్నేహితుడి ఇంటికి బయల్దేరింది. 


వెళ్లే ముందు.. `హే.. నేను ఒక ఐదు నిమిషాల పాటు బయటకు వెళుతున్నాను.ఇక్కడ ఎవరైనా ఉంటే.. దయచేసి ఇంట్లో నుంచి బయటకు వెళ్లండి` అని చెప్పింది. డెకెరా మాటలు విన్న అపరిచితుడు వెంటనే ఇంటి నుంచి వెళ్లిపోయాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. తనకు ఎదురైన అనుభవాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. 

Updated Date - 2022-06-15T21:27:44+05:30 IST