పిల్లల కోసం మూడో పెళ్లి చేసుకున్న యువతి.. ఆ భర్త రోజూ వేధించడంతో ఆమె ఏం చేసిందంటే..

ABN , First Publish Date - 2022-04-25T07:44:16+05:30 IST

ఆమెకు 16 ఏళ్ల వయసులో తొలిసారి వివాహం జరిగింది.. వివాహం జరిగిన ఏడాదికే భర్త కరెంట్ షాక్ కొట్టి చనిపోయాడు.. ఐదేళ్ల తర్వాత ఆ మహిళ మరో వివాహం చేసుకుంది.. భర్త ప్రవర్తన నచ్చకపోవడం వల్ల రెండేళ్లకే అతడికి విడాకులు ఇచ్చింది.. ఏడాది క్రితం మూడో వివాహం చేసుకుంది..

పిల్లల కోసం మూడో పెళ్లి చేసుకున్న యువతి.. ఆ భర్త రోజూ వేధించడంతో ఆమె ఏం చేసిందంటే..

ఆమెకు 16 ఏళ్ల వయసులో తొలిసారి వివాహం జరిగింది.. వివాహం జరిగిన ఏడాదికే భర్త కరెంట్ షాక్ కొట్టి చనిపోయాడు.. ఐదేళ్ల తర్వాత ఆ మహిళ మరో వివాహం చేసుకుంది.. భర్త ప్రవర్తన నచ్చకపోవడం వల్ల రెండేళ్లకే అతడికి విడాకులు ఇచ్చింది.. ఏడాది క్రితం మూడో వివాహం చేసుకుంది.. అతను కూడా తనను వేధింపులకు గురి చేస్తుండడంతో తాజాగా పోలీసులను ఆశ్రయించింది.. తన భర్తపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. 


మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన బాధిత మహిళకు పదేళ్ల క్రితం 16 ఏళ్ల వయసులో వివాహం జరిగింది. వివాహం జరిగిన ఏడాదికే భర్త కరెంట్ షాక్ కొట్టి చనిపోయాడు. అప్పటికి ఆమె గర్భవతి. ఓ ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత 2017లో బాధిత మహిళ రెండో వివాహం చేసుకుంది. నాలుగేళ్ల తన కూతురిని కూడా తనతో పాటు అత్తింటికి తీసుకెళ్లింది. రెండో భర్త తరచుగా మద్యం సేవిస్తూ ఆమెను ఇబ్బంది పెట్టేవాడు. కొట్టేవాడు. దీంతో బాధిత మహిళ అతడి నుంచి విడాకులు తీసుకుంది. 


గతేడాది గ్వాలియర్‌కు చెందిన మరో వ్యక్తిని వివాహం చేసుకుంది. అతను కూడా ఆమెను వేధించడం ప్రారంభించాడు. ఆమెను అవమానిస్తూ హేళన చేయడం ప్రారంభించాడు. దీంతో ఆమె ఎదురు తిరిగింది. పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టింది. ఆ తరువాత  అతను ఆమెను ఇంటి నుంచి బయటకు గెంటేశాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. 


Updated Date - 2022-04-25T07:44:16+05:30 IST