శీల పరీక్షలో ఫెయిల్.. భర్త విధించిన శిక్షేంటంటే..!

ABN , First Publish Date - 2021-04-10T20:17:17+05:30 IST

కన్యత్వ పరీక్షలో విఫలమైందనే కారణంతో నవ వధువును ఇంటి నుంచి బయటకు గెంటేసిన అమానవీయ ఘటన మహారాష్ట్రలో జరిగింది.

శీల పరీక్షలో ఫెయిల్.. భర్త విధించిన శిక్షేంటంటే..!

కన్యత్వ పరీక్షలో విఫలమైందనే కారణంతో నవ వధువును ఇంటి నుంచి బయటకు గెంటేసిన అమానవీయ ఘటన మహారాష్ట్రలో జరిగింది. కొల్లాపూర్‌కు చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు అదే గ్రామానికి చెందిన అన్నాదమ్ముళ్లను గతేడాది నవంబర్‌ 27న పెళ్లి చేసుకున్నారు. ఇది కంజర్భట్ తెగకు చెందిన వివాహం కావడంతో.. ఆ తెగ ఆచారం ప్రకారం పెళ్లైన వెంటనే వధువుకు కన్యత్వ పరీక్ష చేస్తారు.


ఈ వర్జినిటీ టెస్ట్‌లో ఒక వధువు విఫలమైంది. దీంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో కుల పెద్దలు పంచాయతీ నిర్వహించి వధువులిద్దరికీ విడాకులు ఇవ్వాలని తీర్పునిచ్చారు. అలాగే రూ.10 లక్షల రూపాయల నష్ట పరిహారాన్ని వరుడి కుటంబానికి ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. అలాగే వధువు కుటుంబాన్ని కంజర్భట్ తెగ నుంచి బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. ఈ వ్యవహారంపై అమ్మాయిల తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించగా, వారు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నారు. 


Updated Date - 2021-04-10T20:17:17+05:30 IST