ఆ మహిళకు ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది.. అనారోగ్య కారణాల వల్ల ఆ మహిళకు సంతానం కలగలేదు.. దీంతో భర్త, అత్త ఆమెను వేధింపులకు గురి చేశారు.. రోజూ కొట్టేవారు, విడాకులు ఇవ్వాలని బెదిరించేవారు.. విడాకులు ఇచ్చేందుకు ఆ మహిళ సిద్ధపడకపోవడంతో అత్త ఆమెపై పగబట్టింది.. కొడుకును వేరే మహిళతో పంపించి, కోడలిని బయటకు గెంటేసింది.. దీంతో కోడలు పోలీసులను ఆశ్రయించింది.
హర్యానాలోని పానిపట్‌లోని సైనీ కాలనీకి చెందిన మహిళకు ఏడేళ్ల క్రితం ప్రదీప్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. అయితే అనారోగ్య కారణాల వల్ల ఆ మహిళకు పిల్లలు పుట్టలేదు. దీంతో ప్రదీప్, అతని తల్లి ఆమెను వేధించేవారు. ప్రతిరోజూ కొట్టేవారు. విడాకులు ఇవ్వాలని బెదిరించేవారు. అయినా ఆ మహిళ విడాకులు ఇచ్చేందుకు అంగీకరించలేదు. దీంతో ప్రదీప్ తన బంధువుల అమ్మాయితో కలిసి వేరే ఊరిలో కాపురం పెట్టేశాడు. ఈమెను పట్టించుకోవడం మానేశాడు.
ఈ నెల 16న బాధిత మహిళను ప్రదీప్ తల్లి ఇంట్లో నుంచి బయటకు తరిమేసింది. ఇంట్లో ఉండడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. దీంతో బాధిత మహిళ కన్నీళ్లతో పుట్టింటికి చేరింది. తల్లిదండ్రుల సహకారంతో అత్తపై, భర్త ప్రదీప్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించారు.