మొదట్లో చెట్టాపట్టాలేసుకుని తిరిగారు.. బెడిసికొట్టడంతో దూరం.. లవర్‌పై కోపంతో యువతి ఎంత పని చేసిదంటే!

ABN , First Publish Date - 2022-04-29T02:14:27+05:30 IST

యువతి, యువకుడు ఒకరికొకరు నచ్చారు. దీంతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ ఎంజాయ్ చేశారు. ఈ క్రమంలో వారి మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో ఎంత తొందరగా ప్రేమలో పడ్డారో.. అంతే వేగంగా

మొదట్లో చెట్టాపట్టాలేసుకుని తిరిగారు.. బెడిసికొట్టడంతో దూరం.. లవర్‌పై కోపంతో యువతి ఎంత పని చేసిదంటే!

ఇంటర్నెట్ డెస్క్: యువతి, యువకుడు ఒకరికొకరు నచ్చారు. దీంతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ ఎంజాయ్ చేశారు. ఈ క్రమంలో వారి మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో ఎంత తొందరగా ప్రేమలో పడ్డారో.. అంతే వేగంగా విడిపోయారు. ఈ నేపథ్యంలో లవర్‌పై ఆగ్రహంతో ఊగిపోయిన యువతి దారుణానికి పాల్పడింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 



విస్కాన్సిన్‌‌కు చెందిన కెల్లీ హేస్ అనే యువతి కొద్ది రోజుల క్రితం ఓ యువకుడితో ప్రేమలో పడింది. అతడు కూడా ఆమె ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆ జంట కొద్ది రోజులపాటు ఎంజాయ్ చేసింది. ఇంతలో ఏమైందో ఏమో కానీ ఇద్దరూ విడిపోయారు. ఈ నేపథ్యంలో కెల్లీ తన మాజీ ప్రియుడిపై పగ పెంచుకుంది. తనకు నష్టం కలిగించాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే అతడి కారు వద్దకు వెళ్లి, అందులో ఇంధనం పోసి కారుకు నిప్పంటించింది. అయితే కారుకు నిప్పంటించగానే.. కారులోంచి మంటలు ఒక్కసారిగా చెలరేగి విండో నుంచి యువతి ముఖాన్ని తాకాయి. అదృష్టవశాత్తు ఆమెకు ఎటువంటి హానీ కలగలేదు. ఈ దృశ్యాలను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో వీడియో కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. 




Updated Date - 2022-04-29T02:14:27+05:30 IST