ఇంట్లో దొంగలు పడి భర్తను చంపేశారని కేసు పెట్టిన మహిళ.. విచారణలో షాకింగ్ నిజాలు?

ABN , First Publish Date - 2022-06-09T09:53:11+05:30 IST

సడెన్‌గా రాత్రి పూట పోలీసులకు కాల్ వచ్చింది. ఒక వ్యక్తిని ఎవరో చంపేశారని తెలిసింది. హుటాహుటిన అక్కడకు చేరుకున్న పోలీసులు.. ఇంట్లో మంచంపై పడి ఉన్న మృతదేహాన్ని చూశారు. ఆ ఇంట్లో దొంగతనం కూడా జరిగినట్లు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించి, తమ దర్యాప్తు మొదలు పెట్టారు. ఈ క్రమంలో మృతుడికి భార్య చంద్రకళతో ఎప్పుడూ గొడవలు జరుగుతూనే ఉంటాయని తెలిసింది...

ఇంట్లో దొంగలు పడి భర్తను చంపేశారని కేసు పెట్టిన మహిళ.. విచారణలో షాకింగ్ నిజాలు?

సడెన్‌గా రాత్రి పూట పోలీసులకు కాల్ వచ్చింది. ఒక వ్యక్తిని ఎవరో చంపేశారని తెలిసింది. హుటాహుటిన అక్కడకు చేరుకున్న పోలీసులు.. ఇంట్లో మంచంపై పడి ఉన్న మృతదేహాన్ని చూశారు. ఆ ఇంట్లో దొంగతనం కూడా జరిగినట్లు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించి, తమ దర్యాప్తు మొదలు పెట్టారు. ఈ క్రమంలో మృతుడికి భార్య చంద్రకళతో ఎప్పుడూ గొడవలు జరుగుతూనే ఉంటాయని తెలిసింది. దాంతో ఆమెను పిలిచి ప్రశ్నించారు. పోలీసులు ప్రశ్నలు అడిగేకొద్దీ ఆమె తన వాంగ్మూలంలో మార్పులు చేస్తూ వచ్చింది. దాంతో అనుమానం వచ్చిన పోలీసులు.. ఆమెను అదుపులోకి తీసుకొని కఠినంగా విచారణ చేశారు. దాంతో అసలు విషయం బయటకు వచ్చింది. 


వివరాల్లోకి వెళితే.. చంద్రకళ తన భర్త వీర్ బహదూర్‌కు రెండో భార్య. వీర్ బహదూర్‌కు వస్త్ర వ్యాపారం ఉందని, అతని షాపులోనే తను పనిచేసేదాన్నని ఆమె చెప్పింది. ఆ సమయంలో అతను తనతో అసభ్యంగా ప్రవర్తించేవాడని, కానీ ఉద్యోగం పోతుందన్న భయంతో తను భరించేదాన్నని వివరించింది. చివరకు తనను రెండో పెళ్లి చేసుకున్నాడని, ఇద్దరు పిల్లలు కూడా పుట్టిన తర్వాత అతనికి ఇంకా చాలామంది మహిళలతో వివాహేతర సంబంధాలు ఉన్నట్లు తెలిసినట్లు చంద్రకళ పేర్కొంది. ఈ విషయం తెలిశాక తను చెల్లెలితో కలిసి ఉండేందుకు వెళ్లిపోయిందని, అక్కడకు వచ్చిన బహదూర్.. తన చెల్లెలిని కూడా వక్రబుద్ధితో చూశాడని ఆరోపించింది. 


ఆ తరువాత వస్త్ర దుకాణం తనే నడపడం ప్రారంభించానని, అప్పుడే అక్కడ పనిచేసే ఒక యువతి సోదరుడు జుమ్మాన్ జైలు నుంచి విడుదలైనట్లు తనకు తెలిసినట్లు చంద్రకళ తెలిపింది. ఆ యువతి ఇటీవల చనిపోయినా కూడా.. జుమ్మాల్‌తో మాట్లాడి రూ.1.5 లక్షలకు భర్తను హత్య చేసేందుకు బేరం కుదుర్చుకున్నట్లు చెప్పింది. జుమ్మన్ అర్థరాత్రి ఇంటికి వస్తే తనే తలుపు తీశానని, అతను వచ్చి భర్తను సుత్తితో కొట్టి చంపేసి వెళ్లేటప్పుడు.. దొంగతనంలా ఉండాలని తనే రూ.50 వేలు డబ్బులు కూడా అతనికి ఇచ్చినట్లు చంద్రకళ అంగీకరించింది. ఆమె వాంగ్మూలంతో జుమ్మాన్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని దగ్గర నుంచి రూ.50 వేలు నగదుతోపాటు హత్యకు ఉపయోగించిన సుత్తిని కూడా స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.


Updated Date - 2022-06-09T09:53:11+05:30 IST