సహజీవనం చేస్తున్న ఓ మహిళ ఉన్నట్టుండి అదృశ్యమైంది. ఇంటికొచ్చిన భర్త.. అంతా విచారించాడు. ఇంటి యజమానిని విచారించగా.. బంధువుల ఇంటికి వెళ్లిందని చెప్పాడు. కానీ ఎంతకూ రాలేదు. ఎక్కడ వెతికినా కనిపించలేదు. ఫలితం లేకపోవడంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసు విచారణలో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. కర్ణాటక మంగళూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
కర్ణాటక మంగళూరు పరిధిలోని అశోక్ నగర్ ప్రాంతంలో రేణుక చౌవ్వడాల్(30) అనే మహిళ..ఇద్దరు పిల్లలుతో కలిసి ఉంటోంది. ఈ క్రమంలో నాగరాజు అనే వ్యక్తి ఆమెకు దగ్గరయ్యాడు. వారితో చనువుగా ఉండడంతో సమీపంలోని వారంతా ఆమె బంధువేమో అనుకున్నారు. ఇలా వారి పరిచయం కొన్నాళ్లకు వివాహేతర సంబంధానికి దారి తీసింది. పెళ్లి చేసుకోకుండానే సహజీవనం కొనసాగించారు.
అయితే కొద్దిరోజులుగా నాగరాజు.. రేణుకను హింసిస్తున్నట్లు తెలిసింది. రానురాను ఎక్కువవడంతో రేణుక భరించలేకపోయింది. ఈ క్రమంలో నాగరాజు పని నిమిత్తం తన సొంతూరికి వెళ్లాడు. తిరుగొచ్చే సరికి రేణుక తన పిల్లలతో కలిసి కనిపించకుండా పోయింది. పలు చోట్ల గాలింపు చేపట్టినా ఫలితం లేకపోవడంతో నాగరాజు.. ఉర్వా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
ఈ క్రమంలో రేణుక, ఆమె పిల్లలను పోలీసులు గదగ్లో గుర్తించారు. అయితే వారికి వివాహం కాకపోవడంతో కలిసి ఉండాలని చెప్పే అధికారం తమకు లేదని పోలీసులు తెలిపారు. నాగరాజుతో కలిసి ఉండటం ఇష్టం లేని రేణుక.. విడిగా ఉండడానికే ఇష్టపపడంతో చివరకు కథ సుఖాంతమైంది.