Abn logo
Sep 25 2021 @ 00:24AM

డెంగ్యూతో మహిళ మృతి

చందాల రజిత (ఫైల్‌)

నర్సాపూర్‌(జి), సెప్టెంబరు 24 : నిర్మల్‌ జిల్లా నర్సాపూర్‌(జి) మండలం గొల్లమాడకు చెందిన చందాల రజిత (32) అనే మహిళ శుక్రవారం డెంగ్యూ వ్యాధితో మృతి చెందింది. రజిత గత పది రోజులుగా తీవ్ర జ్వరంతో బాఽ దపడుతోంది. డెంగ్యూగా తేలడంతో ఇటీవలే నిర్మల్‌ జిల్లాకేంద్రంలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంది. రెండురోజులు క్రితమే ఆస్పత్రి నుంచి తిరిగి ఇంటికి రాగా.. మళ్లీ తీవ్రజ్వరం వచ్చింది. ఇంట్లోనే ఉండి చికిత్స పొందుతున్న రజిత ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించడంతో.. శుక్రవారం సాయంత్రం మృతి చెందింది. ఈమె భర్త గతంలో అనారోగ్యంతో మృతి చెందాడు. ఇప్పుడు రజిత కూడా మరణించడంతో.. ముగ్గురు పి ల్లలు అనాధలయ్యారు. దీంతో వీరిని ఆదుకోవాలని గ్రా మస్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.