తొమ్మిదేళ్ల క్రితం భర్త మృతి.. ఇప్పుడు భార్య.. అనాథలైన కూతురు, కొడుకు..

ABN , First Publish Date - 2020-08-03T16:31:38+05:30 IST

విద్యుదాఘాతంతో మహిళా రైతు మృతిచెందింది. మునుగోడు మండలం ఇప్పర్తి గ్రామానికి చెందిన చీమల హేమలత(34) తన వ్యవసాయ పొలంలో నీరు పెట్టడా నికి వెళ్లింది. బోరు మోటారుకు విద్యుత్‌

తొమ్మిదేళ్ల క్రితం భర్త మృతి.. ఇప్పుడు భార్య.. అనాథలైన కూతురు, కొడుకు..

విద్యుదాఘాతంతో మహిళా రైతు మృతి

తొమ్మిది ఏళ్ల క్రితం భర్త మృతి

అనాథలైన కూతురు, కొడుకు 


మునుగోడు రూరల్‌(నల్లగొండ): విద్యుదాఘాతంతో మహిళా రైతు మృతిచెందింది. మునుగోడు మండలం ఇప్పర్తి గ్రామానికి చెందిన చీమల హేమలత(34) తన వ్యవసాయ పొలంలో నీరు పెట్టడా నికి వెళ్లింది. బోరు మోటారుకు విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌ కావడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. పక్క పొలంలో ఉన్న రైతు గమనించి హేమలత బంధువులకు సమాచారం ఇచ్చాడు. కాగా, హేమలత భర్త వెంకన్న తొమ్మిది సంవత్సరాల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. అప్పటి నుంచి హేమలత తనకు ఉన్న నాలుగు ఎకరాల భూమిలో వ్యవసాయం చేసుకుంటూ ఇద్దరు పిల్లలను పోషించుకుంటుంది. తల్లిదండ్రులు మృతిచెందడంతో హేమలత కూతురు గీతాంజలి, కుమారుడు రాఖేష్‌ అనాథలయ్యారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రజనీకర్‌ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండ ప్రభు త్వాసుపత్రికి తరలించినట్లు తెలిపారు.

Updated Date - 2020-08-03T16:31:38+05:30 IST