కొవ్వొత్తుల ర్యాలీ

ABN , First Publish Date - 2021-03-08T05:42:25+05:30 IST

మహిళలు అన్ని రంగాలలో ముందుండాలని పాణ్యం సీఐ జీవన్‌ గంగనాథ్‌బాబు పిలుపునిచ్చారు.

కొవ్వొత్తుల ర్యాలీ
చాగలమర్రిలో ర్యాలీ

పాణ్యం, మార్చి 7: మహిళలు అన్ని రంగాలలో ముందుండాలని పాణ్యం సీఐ జీవన్‌ గంగనాథ్‌బాబు పిలుపునిచ్చారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం స్థానిక పోలీసు శాఖ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అనంతరం జాతీయ రహదారిపై మానవహారం ఏర్పాటు చేశారు. పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మహిళా సమావేశంలో సీఐ మాట్లాడుతూ మహిళలు సెల్‌ ఫోన్‌లలో దిశయాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు. ఏఎస్‌ఐ బాలదాసు, మహిళా పోలీసులు, పొదుపు మహిళలు పాల్గొన్నారు.  


నంద్యాల (ఎడ్యుకేషన్‌): మహిళలు అన్ని రంగాలలో రాణించాలని ఇన్నర్‌విల్‌ క్లబ్‌ జిల్లా చైర్మన్‌ వనజ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నంద్యాలలో క్లబ్‌ ఆధ్వర్యంలో ఆదివారం కార్యక్రమం నిర్వహించారు.. కరోనా సమయంలో వీరోచితంగా సేవలు అందించిన మున్సిపల్‌ పారిశుధ్య మహిళ కార్మికులను సన్మానించి చీరెలను అందజేశారు. నంద్యాల శాఖ అధ్యక్షురాలు డాక్టర్‌ ఈశ్వరి, కార్యదర్శి నాగమల్లేశ్వరి, శివలక్ష్మి, రత్నమ్మ పాల్గొన్నారు.


ఆళ్లగడ్డ: మహిళలకు రక్షణ కల్పించడమే పోలీస్‌శాఖ లక్ష్యమని డీఎస్పీ రాజేంద్ర అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని పట్టణంలో మహిళలతో, విద్యార్థినులతో ఆదివారం ర్యాలీ పాతబస్టాండు వరకు నిర్వహించి అక్కడ మానవహారంగా ఏర్పడ్డారు. పట్టణ సీఐ సుబ్రహ్మణ్యం, పట్టణ ఎస్‌ఐ రామిరెడ్డి, రూరల్‌ ఎస్‌ఐ వరప్రసాద్‌, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


చాగలమర్రి: మహిళల రక్షణ మన అందరి బాధ్యతని ఆళ్లగడ్డ రూరల్‌ సీఐ రాజశేఖర్‌రెడ్డి అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా  ఆదివారం రాత్రి వీధుల గుండా కొవ్వొత్తులతో ర్యాలీ చేశారు. గాంధీ సెంటర్‌లో మానవహారంగా ఏర్పడి ప్రతిజ్ఞ చేశారు.ఎస్‌ఐ మారుతి, హమాలీ యూనియన్‌ అధ్యక్షుడు గుత్తి నరసింహులు, మహిళా పోలీసులు, అంగన్‌వాడీ వర్కర్లు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


ఉయ్యాలవాడ: అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టినట్లు ఎస్‌ఐ మల్లికార్జున తెలిపారు. ఆదివారం స్థానిక పోలీసు స్టేషన్‌ నుంచి బస్టాండు ఆవరణ వరకు మహిళా పోలీసులు, మహిళ గ్రామ వలంటీర్లతో కలిసి కొవ్వొత్తులు వెలిగించి ర్యాలీ చేశారు. ఏఎస్‌ఐ రాంభూపాల్‌రెడ్డి, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. 


రుద్రవరం: మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధే లక్ష్యంగా రాణించాలని ఎస్‌ఐ రామ్మోహన్‌రెడ్డి అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం రాత్రి రుద్రవరంలో ఉన్నత పాఠశాల నుంచి అమ్మవారిశాల వరకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. మహిళా పోలీసులు, అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. 


ఓర్వకల్లు: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఎస్‌ఐ వెంకటేశ్వరరావు సూచించారు. ఆదివారం రాత్రి ఎస్‌ఐ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఓర్వకల్లులోని ఆర్టీసీ బస్టాండు నుంచి ఓర్వకల్లు వీదుల్లో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.  ఏఎస్‌ఐ రామిరెడ్డి, షబ్బీర్‌, పోలీసులు పాల్గొన్నారు. 



Updated Date - 2021-03-08T05:42:25+05:30 IST