డీఎమ్‌కే గెలిచిందని.. నాలుక కోసుకుని మొక్కు తీర్చుకున్న మహిళ

ABN , First Publish Date - 2021-05-03T21:54:55+05:30 IST

డీఎమ్‌కే పార్టీ ఎన్నికల్లో గెలిస్తే తన నాలుకు కోసుకుని నైవేద్యం పెడతానంటూ మొక్కుకున్న ఓ మహిళా వీరాభిమాని అన్నంత పనీ చేసింది.

డీఎమ్‌కే గెలిచిందని.. నాలుక కోసుకుని మొక్కు తీర్చుకున్న మహిళ

చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎమ్‌కే గెలిస్తే తన నాలుక కోసుకుని నైవేద్యం పెడతానంటూ మొక్కుకున్న ఓ మహిళా వీరాభిమాని అన్నంత పనీ చేసింది. ఎన్నికల్లో డీఎమ్‌కే విజయదుందుభి మోగించిందని తెలుసుకున్న వనిత(32) అనే మహిళ.. తన మొక్కును తీర్చుకునేందుకు స్థానికంగా ఉన్న ముత్తలమ్మన్ దేవాలయానికి వెళ్లింది. కొవిడ్ కారణంగా గుడి తలుపులు మూసి ఉండడంతో..గేటు వద్దే ఆమె తన నాలుక కోసేసుకుని, తెగిన భాగాన్ని నైవేద్యంగా గేటు వద్ద వదిలేసింది. ఈ క్రమంలో ఆమె స్పృహ తప్పి పడిపోవడంతో చుట్టుపక్కల వారు ఆమెను ఆస్పత్రికి తరలించారు. కాగా.. దశాబ్దం తరువాత స్టాలిన్ సారథ్యంలోని డీఎమ్‌కే తమిళనాడులో అధికారాన్ని కైవసం చేసుకుంది. అయితే.. ఇన్నేళ్లుగా అధికారంలో ఏఐడీఎమ్‌కే సీఎం పళణిస్వామి సారథ్యంలో ఎన్నికల్లో పోటికి దిగి చెప్పుకోదగ్గ సంఖ్యలో సీట్లు సాధించి ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. కమల్ హసస్‌ సారథ్యంలోని మక్కల్ నీది మయ్యం పార్టీ మాత్రం ఈ ఎన్నికల్లో బోణీ కొట్టలేక పోయింది. 

Updated Date - 2021-05-03T21:54:55+05:30 IST