Abn logo
Sep 25 2021 @ 15:32PM

మహిళా కానిస్టేబుల్‌పై సామూహిక అత్యాచారం.. ఆపై వీడియో తీసి..

నీముచ్: మహిళా కానిస్టేబుల్‌పై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ముగ్గురు దుండగులు ఆపై వీడియో తీసి బెదిరించిన ఘటన మధ్యప్రదేశ్‌లోనీ నీముచ్ జిల్లాలో జరిగింది. ఈ నెల మొదట్లోనే దారుణం జరగ్గా బాధితురాలు ఈ నెల 13న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ప్రధాన నిందితుడి తల్లి సహా ఐదుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రధాన నిందితుడు, అతడి తల్లిని అరెస్ట్ చేశారు. 



పోలీసుల కథనం ప్రకారం.. 30 ఏళ్ల బాధిత కానిస్టేబుల్‌కు నిందితుడు ఫేస్‌బుక్‌లో పరిచయమయ్యాడు. ఏప్రిల్ నుంచి వాట్సాప్ ద్వారా తరచూ చాటింగ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో తన సోదరుడి పుట్టిన రోజు వేడుకకు రావాలంటూ బాధితురాలని ఆహ్వానించాడు. అతడి మాటలు నమ్మి వెళ్లిన బాధితురాలిపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 


పార్టీలో తనపై ప్రధాన నిందితుడు, అతడి సోదరుడు, మరో వ్యక్తి కలిసి అత్యాచారానికి పాల్పడినట్టు బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. అలాగే, ఈ ఘటనను వీడియో తీసినట్టు కూడా ఆరోపించింది. ప్రధాన నిందితుడి తల్లి తనను బెదిరించిందని, వారి బంధువు ఒకరు తనను చంపేస్తానని బెదిరించడమే కాకుండా డబ్బులు కూడా గుంజుకునేందుకు ప్రయత్నించారని ఆరోపించింది. బాధిత కానిస్టేబుల్ తొలుత నీముచ్‌లో పనిచేసిందని, ప్రస్తుతం ఇండోర్ జిల్లాలో పనిచేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది. 

ఇవి కూడా చదవండిImage Caption

క్రైమ్ మరిన్ని...