చాణక్యనీతి: అలాంటి స్త్రీలకు భర్త శత్రువుతో సమానం.. ఏదో ఒక వివాదం వెంటాడుతుంటుంది!

ABN , First Publish Date - 2022-07-02T12:16:04+05:30 IST

భార్యాభర్తల బంధంలో ఇద్దరూ సంస్కరవంతులై...

చాణక్యనీతి: అలాంటి స్త్రీలకు భర్త శత్రువుతో సమానం.. ఏదో ఒక వివాదం వెంటాడుతుంటుంది!

భార్యాభర్తల బంధంలో ఇద్దరూ సంస్కరవంతులై ఉండటం చాలా ముఖ్యమని ఆచార్య చాణక్య తెలిపారు. ఇదిలేని పక్షంలో ఆ సంబంధంలో మాధుర్యం ఉండదన్నాడు. అలాంటి సంబంధం భార్యాభర్తలిద్దరి జీవితాలను దెబ్బతీస్తుంది. రిలేషన్‌షిప్‌లో నమ్మకం పోయిన తర్వాత, ఆ సంబంధం బలంగా నిలబడదు. అటువంటి పరిస్థితిలో వివాదాలు ఖచ్చితంగా తలెత్తుతాయి.  భార్యాభర్తల సంబంధానికి సంబంధించి ఆచార్య చాణక్య తెలిపిన వివరాల ప్రకారం మహిళకు వివాహానికి ముందు వేరే వ్యక్తితో సంబంధం ఉంటే, ఆమె తన వివాహాన్ని భారంగా భావిస్తుంది. 


అలాంటి భార్య దృష్టిలో ఆమెకు భర్త ముల్లులా కనిపిస్తాడు. అప్పుడు ఆమె అతన్ని శత్రువుగా పరిగణిస్తుంది. అలాంటి సంబంధంలో సమయం గడచిపోతుంటుంది తప్పా మాధుర్యం ఉండదు. అలాంటి భార్య ఏ పురుషునికైనా ఇబ్బందిగా పరిణమిస్తుంది. ఆచార్య చాణక్యుడు చెప్పేదేమిటంటే, భార్యాభర్తలలో ఎవరైనా ఏదైనా తప్పుడు అలవాట్లు, వ్యసనాల బారిన పడినట్లయితే దాని పర్యవసానాన్ని ఇద్దరూ అనుభవించవలసి ఉంటుంది. అంటే భర్త చేసిన తప్పుకు భార్య, భార్య చేసిన తప్పుకు భర్త శిక్ష అనుభవిస్తారు. అందుకే, సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం చెడు అలవాట్లను వదిలివేయడం అవసరం. భార్యాభర్తలిద్దరూ తమ మధ్య ఉన్న వ్యక్తిగత విషయాలను తమ దగ్గరే ఉంచుకోవాలి. మరెవరికీ చెప్పకూడదు. ఇలా చెప్పడం వల్ల ఒకరిపై ఒకరికి నమ్మకం తగ్గి పరస్పర కలహాలు పెరుగుతాయి. కొన్నిసార్లు ఈ విషయాలు అవమానానికి కారణం కావచ్చు. భార్యాభర్తలు ఒకరికొకరు అబద్ధాలు చెప్పుకుంటే, వారి సంబంధం క్రమంగా చేదుగా మారుతుంది. నమ్మకం అనే పునాది కదిలిపోయిన తర్వాత మాధుర్యమనేది ఉండదు. అందుకే భార్యాభర్తలు తమ జీవిత భాగస్వామి విషయంలో ఎంతో నిజాయితీగా ఉండటం ముఖ్యం.

Updated Date - 2022-07-02T12:16:04+05:30 IST